ఘోర రోడ్డు ప్రమాదం.. 41మంది మృతి..!

Published : Aug 04, 2021, 07:34 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 41మంది మృతి..!

సారాంశం

లారీ టైర్ పేలడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని.. దీంతో బస్సుకు ఎదురుగా వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.

ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళుతున్న లారీ, ప్రయాణికులతో వెళుతున్న బస్సులు డీకొనడంతో దాదాపు 41మంది ప్రాణాలు కోల్పోయారు.  మరో 33మంది తీవ్రంగా గాయపడ్డారు.

కాగా.. క్షతగాత్రులను 20 కిలోమీటర్ల దూరంలోని సెగో పట్టణానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ టైర్ పేలడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని.. దీంతో బస్సుకు ఎదురుగా వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి.

ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతను క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం... ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్లు ఆఫ్రికా దేశాల్లో దర్శనమిస్తాయి. ఏటా అక్కడి దేశాల్లో ప్రతి లక్ష జనాభాకు రోడ్డు ప్రమాదాల్లోనే 26మంది చనిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

న‌న్ను అరెస్ట్ చేస్తే, మా ప్ర‌త్యేక ద‌ళాలు రంగంలోకి దిగుతాయి.. ఇజ్రాయెల్ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు, మ‌ధ్య‌లో పాకిస్థాన్‌.? ట్రంప్ వ్యాఖ్య‌ల‌తో మొద‌లైన కొత్త చ‌ర్చ