కాందహర్ ఎయిర్‌పోర్టుపై రాకెట్లతో తాలిబన్ల దాడి

By narsimha lodeFirst Published Aug 1, 2021, 10:56 AM IST
Highlights

కాందహర్ ఎయిర్ పోర్టుపై రాకెట్లతో తాలిబన్లు దాడికి దిగారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారు,ఆస్తి నష్టం ఎంతుందనే విషయమై ఆఫ్ఘన్ ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

కాందహార్: ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహర్ ఎయిర్‌పోర్టుపై  రాకెట్ల దాడి ఆదివారం నాడు చోటు చేసుకొంది. ఆఫ్గనిస్తాన్ లో అమెరికా బలగాలను ఉపసంహరించుకొన్న తర్వాత తాలిబన్లు దాడులు పెంచుతున్నారు. మూడు రాకెట్ల దాడి చోటు చేసుకొందని స్థానిక మీడియా తెలిపారు.అమెరికా బలగాలను ఉపసంహరించుకొన్న తర్వాత తాలిబన్ల దాడులు పెరిగిపోయాయి. కాందహార్ ఎయిర్‌పోర్టును  ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకొనేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో కాందహర్ కీలకమైన నగరం.

తాలిబన్ల దాడుల నుండి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం శరణార్ది శిబిరాలను ఏర్పాటు చేసింది.ఈ శరణార్ధి శిబిరాల్లో సుమారు 11 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు.కాందహర్ లో  ఆర్మీ, తాలిబన్ల మధ్య ఘర్షణల నేపథ్యంలో సామాన్యులు ఇబ్బందిపడుతున్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిస తర్వాత  ఆఫ్ఘనిస్తాన్ లోని అమెరికా బలగాలను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఉపసంహరించుకొంటామని ప్రకటించారు.ఆఫ్ఘనిస్తాన్ లోని 85 ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొన్నామని తాలిబన్ ప్రకటించింది. కాందహర్ లోని 85 శాతం చెక్‌పోఃస్టులను తమ స్వాధీనంలోకి తీసుకొన్నామని తాలిబన్లు ప్రకటించారు.

click me!