పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి.. 50 మందికి గాయాలు!

Published : Sep 26, 2021, 11:28 AM ISTUpdated : Sep 26, 2021, 11:29 AM IST
పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి.. 50 మందికి గాయాలు!

సారాంశం

అమెరికాలో రైలు ప్రమాదం జరిగింది. చికాగో నుంచి సియాటెల్ వెళ్తున్న ఆంత్రాక్స్ ట్రైన్ మొంటానా రాష్ట్రంలో పట్టాలు తప్పింది. కనీసం ఐదు బోగీలు నేలకొరిగాయి. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. సుమారు 50 మంది గాయపడ్డట్టు తెలిసింది.

వాషింగ్టన్: అమెరికా(America)లో రైలు(Train) ప్రమాదం(Accident) జరిగింది. చికాగో నుంచి సియాటెల్ వెళ్తున్న ట్రైన్ మొంటానా రాష్ట్రంలో పట్టాలు తప్పింది(Derail). కనీసం ఐదు బోగీలు పూర్తిగా నేలకొరిగాయి. జొప్లిన్ పట్టణంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు (22:00 జీఎంటీ)ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో కనీసం ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. 50 మందికిపైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు ఆ ఆంత్రాక్స్ ట్రెయిన్‌లో 147 మంది ప్రయాణికులున్నారు. కనీసం 13 మంది సిబ్బంది ఉన్నారు.

 

బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. హిల్ కౌంటీ మొంటానాలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. కనీసం ఐదు హాస్పిటళ్లు వీరికి చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.

శనివారం నాటి ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించినట్టు లిబర్టీ కంట్రీ షెరిఫీ కార్యాలయంలోని డిస్పాచర్ స్టార్ టైలర్ మాట్లాడుతూ తెలిపారు. పలువురు గాయపడ్డట్టు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?