Jehane Thomas: అరుదైన వ్యాధితో అమెరికన్ టిక్‌టాక్ స్టార్ మృతి.. విషాదంలో అభిమానులు.. 

Published : Mar 22, 2023, 01:02 AM IST
Jehane Thomas: అరుదైన వ్యాధితో అమెరికన్ టిక్‌టాక్ స్టార్ మృతి.. విషాదంలో అభిమానులు.. 

సారాంశం

Jehane Thomas: అమెరికన్ టిక్‌టాక్ స్టార్ జెహానె థామస్ (30) అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితురాలు అలిక్స్ రీస్ట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జెహానె థామస్ తన అద్భుత నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అరుదైన వ్యాధితో చనిపోవడం విషాదకరం.

Jehane Thomas: అమెరికాకు చెందిన  టిక్‌టాక్ స్టార్ జెహాన్ థామస్ (30) అనారోగ్యంతో మరణించారు. థామస్ మరణ వార్తను ఆమె స్నేహితురాలు అలిక్స్ రీస్ట్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వార్తతో వేలాది మంది ఆయన అనుచరులు విషాదంలో మునిగిపోయారు. దాదాపు 2 సంవత్సరాలుగా జెహాన్ తరచూ మైగ్రేన్‌తో బాధపడుతోంది. మొదట్లో పట్టించుకోలేదు. తలనొప్పి పెరగడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.

కొన్ని వారాల క్రితం..   జెహాన్ థామస్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మాట్లాడుతూ..తనకు ఆప్టిక్ న్యూరైటిస్ అనే అరుధైన వ్యాధి సోకిందనీ, ఆప్టిక్ న్యూరిటిస్ కారణంగా తన కంటి యొక్క ఆప్టిక్ నరాల వాపు కనిపించిందని చెప్పారు. తన GoFundMe  పేజీలో షేర్ చేసిన వీడియోలో.. థామస్ ఆసుపత్రి బెడ్‌పై పడుకుని షెడ్యూల్ చేసిన శస్త్రచికిత్స గురించి మాట్లాడుతున్నట్లు కనిపించింది. అప్పటికే ఆమె పరిస్థితి బాగోలేదు. నడవడానికి కూడా వీల్లేదు. తలను పైకి లేపలేను, నడవలేకపోతున్నాను, నొప్పి ఎంత దారుణంగా ఉంటుందో' అని ఆమె వీడియోలో పేర్కొంది. "నా కొడుకులతో పాటు నాకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ నాతో  ఉన్న మా అమ్మ,నాన్నలకు నేను చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను" అని జెహాన్ ఒక పోస్ట్‌లో రాశారు. 

 
జెహాన్ థామస్ మరణ వార్తను అతని స్నేహితుడు అలిక్స్ రీస్ట్ తన GoFundMe పేజీలో పంచుకున్నారు. ఇందులో థామస్ మరణానంతరం ఆమె ఇద్దరు కుమారులు ఐజాక్, ఎలిజా గురించి కూడా ప్రస్తవించారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. జెహాన్ నిష్క్రమణ పూర్తిగా అనూహ్యమని పోస్ట్ లో రాశారు. న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం.. టిక్‌టాక్ స్టార్ జహాన్ థామస్ కు దాదాపు 72,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !