రూ. 2.9 కోట్ల లాటరీ గెలుచుకున్న భార్య మరొకరిని పెళ్లి చేసుకుంది.. షాక్‌లో భర్త

Published : Mar 21, 2023, 07:32 PM ISTUpdated : Mar 21, 2023, 07:33 PM IST
రూ. 2.9 కోట్ల లాటరీ గెలుచుకున్న భార్య మరొకరిని పెళ్లి చేసుకుంది.. షాక్‌లో భర్త

సారాంశం

రూ. 2.9 కోట్ల లాటరీ గెలుచుకున్న తర్వాత భార్య మరొకరిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఖంగుతిన్నాడు. 20 ఏళ్లు తనతో కలిసి జీవించిన భార్య ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదని ఆయన వాపోయాడు.  

న్యూఢిల్లీ: వారు 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు ఆడబిడ్డలకూ జన్మనిచ్చారు. చేసిన అప్పు తీర్చడానికి విదేశానికి వెళ్లి కష్టపడ్డారు. పిల్లలను చూడటానికి స్వదేశానికి వెళ్లిన భార్య.. భర్తను దారుణంగా మోసం చేసింది. లాటరీ గెలుచుకున్న ఆమె తన భర్తకు ఆ విషయం చెప్పనేలేదు. అంతేకాదు, మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని భర్తకు షాక్ ఇచ్చింది. స్వదేశానికి తిరిగి వచ్చిన భర్త తనకు న్యాయం కావాలని అంటున్నాడు. ఈ ఘటన థాయ్‌ల్యాండ్‌లో చోటుచేసుకుంది.

థాయ్‌గర్ న్యూస్ పోర్టల్ ప్రకారం, 47 ఏళ్ల నరిన్.. చవీవాన్ అనే మహిళను 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు సంతానం. అయితే, 2 మిలియన్ల బాత్‌ల అప్పు ఉన్నది. ఆ అప్పు తీర్చడానికి వారు దక్షిణ కొరియాకు 2014లో వలస వెళ్లారు. పిల్లల ఆలనా పాలనా చూసుకోవడానికి భార్య తిరిగి థాయ్‌ల్యాండ్‌కు వచ్చేసింది. అప్పు తీర్చడానికి ఆ భర్త ప్రతి నెలా ఆమెకు డబ్బు పంపించాడు. సుమారు 27 వేల నుంచి 30 వేల బాత్‌లు పంపాడు.

తన భార్య రూ. 2.9 కోట్ల (12 మిలియన్ల థాయ్‌ల్యాండ్ బాత్‌లు) లాటరీ గెలుచుకుందని, కానీ, ఆ విషయాన్ని తన నుంచి దాస్తున్నదనే విషయాన్ని నరిన్ తెలుసుకున్నాడు. ఆమెకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోగా.. తిరస్కరిస్తూనే ఉన్నది. దీంతో మార్చి 3వ తేదీన నరిన్ థాయ్‌ల్యాండ్‌కు తిరిగి వచ్చేశాడు. 

Also Read: రోడ్లపై నగ్నంగా తిరిగి తానే పోలీసులకు ఫోన్ చేసి రప్పించిన హాలీవుడ్ నటి.. అసలేం జరిగిందంటే?

థాయ్‌ల్యాండ్‌కు వచ్చిన తర్వాత అతనికి ఓ చేదు నిజం తెలిసింది. ఫిబ్రవరి 25న తన భార్య మరొకరిని పెళ్లి చేసుకుందనే విషయం అతనికి తెలియవచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తాను షాక్‌కు గురయ్యాడని తెలిపాడు. ‘నేను చాలా బాధపడ్డాను. 20 ఏళ్లు నాతో కలిసి బతికిన నా భార్య ఇలా చేస్తుందని ఊహించలేదు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్‌లో కేవలం 60 వేల బాత్‌లు మాత్రమే మిగిలాయి. ఎందుకంటే ప్రతి నెల నేను ఆమెకు డబ్బులు పంపించాను. నాకు న్యాయం కావాలి. నాకు రావాల్సిన డబ్బు నాకు దక్కాలి’ అని నరిన్ వాపోయాడు. 

కాగా, తాను అతనితో 9 ఏళ్ల క్రితమే బ్రేకప్ చేసుకున్నామని, లాటరీ గెలవకముందే తాము విడిపోయామని, అందుకే తన లవర్‌ను పెళ్లి చేసుకున్నట్టు చవీవాన్ చెప్పారు. ఆ బ్రేకప్ గురించి తనకు తెలియదని నరిన్ అన్నాడు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !