రోడ్లపై నగ్నంగా తిరిగి తానే పోలీసులకు ఫోన్ చేసి రప్పించిన హాలీవుడ్ నటి.. అసలేం జరిగిందంటే?

Published : Mar 21, 2023, 05:48 PM IST
రోడ్లపై నగ్నంగా తిరిగి తానే పోలీసులకు ఫోన్ చేసి రప్పించిన హాలీవుడ్ నటి.. అసలేం జరిగిందంటే?

సారాంశం

హాలీవుడ్ యాక్టర్ లాస్ ఏంజెల్స్ వీధుల్లో నగ్నంగా తిరిగింది. కారులో నుంచి ఆమె నగ్నంగా బయట అడుగు పెట్టింది. ఆ తర్వాత ఆమెనే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి రప్పించుకుంది. వెంటనే స్పాట్‌కు వచ్చిన పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లారు.  

న్యూఢిల్లీ: ఆమె అమెరికన్ యాక్టర్. హాలీవుడ్‌లో పేరుమోసిన నటి. 1990, 2000వ దశాబ్దాల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న నటి. ఆమె లాస్ ఏంజెల్స్ వీధుల్లో నగ్నంగా తిరుగాడింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే.. ఆమెనే 911కు డయల్ చేసి పోలీసులను రప్పించింది. పోలీసులు ఆమెను వెంట బెట్టుకుని తీసుకెళ్లారు.

లాస్ ఏంజెల్స్‌ వీధిలో ఆమె ఒంటిపై నూలు పోగు లేకుండా కారులో నుంచి దిగింది. తాను సైకియాట్రిక్ ఎపిసోడ్ నుంచి ఇప్పుడే వస్తున్నట్టు డ్రైవర్‌కు చెప్పింది. బట్టలు లేకుండా నగ్నంగా ఆ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లింది. మళ్లీ ఆమెనే 911కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు వచ్చారు. ఆమెను తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లారు.

మానసిక నిపుణులు అక్కడికి చేరుకున్నారు. ఆమెను మెడికల్ ప్రొఫెషనల్స్‌కు చూపించి సైకియాట్రిక్ ఫెసిలిటీలో ఉంచాలని, ఆమె మానసిక స్థితిని పరిశీలించాలని వారు చెప్పారు. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం ఫెసిలిటీ కేర్‌లోనే ఉన్నది. మరికొన్ని రోజులు చికిత్స తీసుకోనుంది. 

Also Read: ఆరేళ్ల కాపురం తర్వాత భార్య సొంత చెల్లి అని తెలిసింది.. ఖంగుతిన్న భర్తకు నెటిజన్లు ఏమని సూచించారంటే?

హాలీవుడ్‌లో అశేష అభిమానులు సంపాదించుకున్న అమండా బైన్స్ గత కొంత కాలంగా మానసికంగా చితికిపోతున్నది. ఆమె మానసిక అనారోగ్యం దారుణంగా దిగజారింది. గతేడాదే ఆమె కన్జర్వేటర్షిప్ నుంచి బయటపడింది. ఈ నెలలోనే ఆమె ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సింది. కానీ, అది రద్దయింది.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !