బీచ్‌లో ముగ్గురు యువతుల దారుణ హత్య.. ఏదో వెంటాడుతున్నదనే అనుమానంతో ఆప్తులకు మెస్సేజీలు.. ‘నాకేమన్నా జరిగితే’

By Mahesh K  |  First Published Apr 19, 2023, 4:12 AM IST

ఈక్వెడార్ బీచ్ ట్రిప్‌ కోసం ముగ్గురు యువతులు వెళ్లారు. కానీ, వారు విగత జీవులై కనిపించారు. అత్యంత దారుణంగా వారు హత్యకు గురయ్యారు. అయితే, వారు మరణించడానికి ముందు ఆప్తులకు పంపిన మెస్సేజీలు కలవరపెడుతున్నాయి. 
 


న్యూఢిల్లీ: ముగ్గురు యువతులు ఈక్వెడార్ బీచ్‌లో ట్రిప్ వేయడానికి వెళ్లారు. చాలా సరదాగా గడపాలని అనుకున్నారు. కానీ, వారికి ఏదో జరగబోతుందనే అనుమానం వచ్చింది. ఎవరో తమను వెంటాడుతున్న సంశయాలు వచ్చాయి. ఇద్దరు యువతులు తమ ఆప్తులకు మెస్సేజీలు పంపారు. ఓ యువతి మెస్సేజీ చేసిన లైవ్ లొకేషన్‌కు సమీపంలోనే ఆ ముగ్గురు దారుణంగా హత్యకు గురయ్యారు. స్వల్ప లోతుగల గోతిలో ముగ్గురిని పాతిపెట్టారు. గొంతులు కోసి, తాళ్లతో కట్టేసి ఆ మృతదేహాలు కనిపించాయి.

19 ఏళ్ల డెనిస్సీ రేనా, 21 ఏళ్ల యులియానా మేసియస్, 22 ఏళ్ల నయేలీ తాపియాలు ఈక్వెడార్ బీచ్ ట్రిప్‌కు వెళ్లారు. మేషియస్ సింగ్, తాపియా తల్లి, రేనా అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ స్టూడెంట్. ఏప్రిల్ 4వ తేదీ నుంచి వారి ఆచూకీ కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత వారి మృతదేహాలు లభించాయి. లోతులేని గోతుల్లో వారిని పాతిపెట్టినట్టు న్యూయార్క్ పోస్టు రిపోర్ట్ చేసింది.

Latest Videos

ఈ ముగ్గురిలో ఇద్దరు తమ ఆప్తులకు మెస్సేజీలు చేశారు. తాము ప్రమాదంలో ఉన్నామనే అనుమానం ఆ మెస్సేజీలో స్పష్టంగా కనిపించింది. ‘ఏదో జరగబోతున్నదనే అనుమానం వస్తున్నది’ అంటూ ఓ మెస్సేజీ అందులో ఉన్నది.

ఈక్వెడార్ న్యూస్ ఔట్‌లెట్ విస్తాజో ప్రకారం, తాపియా తన సోదరికి టెక్స్ట్ మెస్సేజీలు చేసింది. ఏప్రిల్ 4వ తేదీన 11.10 గంటలకు లైవ్ లొకేషన్‌‌తో వాట్సాప్ మెస్సేజీ పంపింది. ‘ఈ మెస్సేజీ ఎందుకు పంపిస్తున్నానంటే.. ఏదైనా జరిగితే’ అంటూ టెక్స్ట్ పెట్టింది. ఆ ముగ్గురూ ఆ లొకేషన్‌కు సమీపంలోనే మరణించారు.

రేనా మిస్ కావడానికి కొన్ని గంటల ముందు ఫ్రెండ్‌కు మెస్సేజీ చేసింది. ‘ఏదో జరగబోతున్నట్టు నాకు అనిపిస్తున్నది. నాకేమైనా జరిగితే మాత్రం ఒకటి గుర్తు పెట్టుకో.. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా’ అంటూ టెక్స్ట్ చేసింది.

Also Read: శృంగారం విషయమై గొడవ.. బావిలో దూకిన మహిళను కాపాడిన భర్త.. బయటకు తీసి మళ్లీ చంపేసిన వైనం

ఆ ముగ్గురిని వేధించినట్టుగా వారి దేహాలపై గుర్తులు ఉన్నాయి. వారి నోటిలోనూ దేనితోనో కవర్ చేశారు. వారంతా యంగే, బీచ్ దుస్తులు, స్నానపు సూట్‌లు, షార్ట్స్‌లో ఉన్నారని క్వినైండి పోలీసు డీగో వేలస్తగూ స్థానిక మీడియాకు తెలిపారు. అక్కడి నుంచి ఓ మొబైల్ ఫోన్‌ను పోలీసులు రికవరీ చేసుకున్నారు. తదుపరి దర్యాప్తులో ఇది కీలకంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. హంతకుడు(లు?) కోసం అధికారులు గాలింపులు జరుపుతున్నారు.

జాలర్ల గుంపు ఈ ఉదంతాన్ని తొలుత గుర్తించింది. ఓ కుక్క అక్కడికి వెళ్లి వాసన చూడటం, దుర్వాసన రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

click me!