నైట్ స్ట్రిప్ క్లబ్‌లో గంటన్నరలో 22 షాట్లు.. బ్రిటీష్ టూరిస్ట్ మృతి.. ‘ఆల్కహాల్ పాయిజనింగ్’

By Mahesh KFirst Published Apr 19, 2023, 12:11 AM IST
Highlights

పోలాండ్‌లో ఓ పోలిష్ నైట్ స్ట్రిప్ క్లబ్‌లోకి బ్రిటీష్ పర్యాటకుడిని లోభ పెట్టి తీసుకెళ్లారు. ఉచిత ప్రవేశం అని చెప్పి లోనికి తీసుకెళ్లి ఫుల్‌గా తాగించారు. అదే క్లబ్‌లో బ్రిటీష్ పర్యాటకుడు కుప్పకూలిపోయాక డబ్బులు గుంజుకున్నారు.
 

న్యూఢిల్లీ: బ్రిటీష్ టూరిస్టు ఒకరు పోలాండ్‌లో పర్యటిస్తున్నాడు. ఓ ఫ్రెండ్‌తో కలిసి పర్యటిస్తుండగా ఫ్రీ ఎంట్రీ ఆఫర్ ఇచ్చి నైట్ స్ట్రిప్ క్లబ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ గంటన్నర వ్యవధిలోనే 22 షాట్లు ఆయనకు అందించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తిని తాగించేలా వారు చేశారు. ఆల్కహాల్ పాయిజనింగ్‌తో ఆ పర్యాటకుడు మరణించాడు. అతని వద్ద ఉన్న డబ్బును లాక్కున్నారు. ఈ ఘటన పోలాండ్‌లోని క్రకోవ్ నగరంలో చోటుచేసుకుంది.

36 ఏళ్ల మార్క్ సీ అనే బ్రిటీషర్ పోలాండ్‌లో పర్యటించాడు. మరో ఫ్రెండ్‌తో కలిసి తిరుగుతుండగా కొందరు వ్యక్తులు వారికి ఉచిత ప్రవేశం పేరిట ఓ నైట్ స్ట్రిప్ క్లబ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆయనతో తక్కువ కాలంలో 22 షాట్లు తాగించారు. ఆయన వద్దంటున్నా స్టాఫ్ అతడిని కన్విన్స్ చేశారు. అనంతరం, ఆ క్లబ్‌లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతని వద్ద ఉన్న 2,200 పోలింగ్ జ్లోటీలు(రూ. 42,816)ల నగదు తీసుకున్నారు. 

మరణించినప్పుడు అతని బాడీలో రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ 0.4 శాతం ఉన్నది. సాధారణంగా రక్తంలో 0.3 శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే ఆల్కహాల్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

Also Read: ఫిమేల్ బ్రూస్ లీ : రెస్టారెంట్లో చేయిపట్టుకున్న కస్టమర్ ను రఫ్షాడించిన వెయిట్రెస్.. వీడియో వైరల్..

ఈ ఘటన 2017లో జరిగింది. అయితే, ఈ కేసులో 58 మంది నేరస్తులపై పోలీసులు అభియోగాలు మోపారు. ఇతర నైట్ క్లబ్‌లపైనా రైడ్లు చేసి వారిపై సుమారు 700 కేసులు నమోదు చేశారు. 

సెంట్రల్ పోలీసు ఇన్వెస్టిగేషన్ బ్యూరో కీలక విషయం తెలిపింది. సాధారణంగా క్లబ్‌లే ఓ ర్యాకెట్‌ను నడుపుతాయి. అవి కస్టమర్లకు పూటుగా తాగించి డబ్బులు లాక్కుంటాయి. మార్క్ సీ శారీరక, మానసిక కండీషన్ చూసి ఆ గ్రూపు వల వేసింది. ఆ తర్వాత తాగిన డబ్బులనూ వారి పేమెంట్ కార్డుల ద్వారా, ఇతర సర్వీసులకూ బాధితుడి కార్డులు, ఇతర సమాచారం నుంచి పేమెంట్ ఫినిష్ చేస్తారు.

click me!