సబ్ మెరైన్ జాడ ఇంకా దొరకలే.. మరో నాలుగు గంటలకు మాత్రమే మిగిలి ఉన్న ఆక్సిజన్..

Published : Jun 22, 2023, 03:37 PM IST
సబ్ మెరైన్ జాడ ఇంకా దొరకలే.. మరో నాలుగు గంటలకు మాత్రమే మిగిలి ఉన్న ఆక్సిజన్..

సారాంశం

టైటానిక్ షిప్ చూసేందుకు వెళ్లి గల్లంతైన సబ్ మెరైన్ జాడ ఇంకా దొరకలేదు. దాని కోసం రెస్క్యూ సిబ్బంది ఇంకా గాలిస్తున్నారు. అయితే అందులో ఉన్న వారికి అందుతున్న ఆక్సిజన్ మరి కొన్ని గంటల్లో అయిపోయే అవకాశాలు ఉన్నాయి. 

నీటిలో మునిగి పోయిన టైటానిక్ చూసేందుకు వెళ్లి, గల్లంతైన జలాంతర్గామి జాడ ఇంకా లభించలేదు. దీని కోసం గాలింపు, సహాయక చర్యలు కీలక దశకు చేరుకున్నాయి. అయితే గురువారం ఐదుగురికి ఆక్సిజన్ సరఫరా అయిపోయే అవకాశం ఉంది. వారందరికీ ఇంకా నాలుగు గంటలకు సరిపోయే ఆక్సిజన్ మాత్రమే ఉంది. 

ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

ఆ సబ్ మెరైన్ కోసం నిపుణులు రంగంలోకి దిగారు. సోనార్ నీటి అడుగున గుర్తుతెలియని శబ్దాలను వారు గుర్తించారు. దీంతో కోస్ట్ గార్డ్ అధికారులు కొంత ఆశాజనకంగా ఉన్నారు. కానీ ఆ సబ్ మెరైన్ లో ఉన్న సిబ్బందిని సజీవంగా గుర్తించడం, వారిని వెలికితీయడం సవాలుగా మారింది. అయితే గురువారం తెల్లవారుజామున ప్రయాణికులకు ఆక్సిజన్ అయిపోవచ్చని రెస్క్యూ సిబ్బంది అంచనా వేస్తున్నారు.

దారుణం.. మూడో తరగతి బాలికపై రిటైర్డ్ టీచర్ల సామూహిక అత్యాచారం.. 20 ఏళ్ల శిక్ష విధించిన కోర్టు

1912 ఏప్రిల్ 14, 15 తేదీల మధ్యరాత్రి టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో కేవలం మూడు గంటల్లో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 1500,650 మంది ప్రాణాలు కోల్పోయారు. కెనడాకు 3 కిలోమీటర్ల దూరంలో 3,843 మీటర్ల లోతులో నౌక రెండు ముక్క‌లుగా చీలి మునిగిపోయింది. రెండు ప్రాంతాలు ఒకదానికొకటి 800 మీటర్ల దూరంలో ఉన్నాయి. జేమ్స్ కామెరూన్ టైటానిక్ సినిమా తీసిన తర్వాత టైటానిక్ ఖ్యాతి చెక్కుచెదరకుండా నిలిచిపోయింది. ఆ సమయంలోనే అది అక్కడి హిమానీనదాల్లో కూలిపోయినట్లు వారు గుర్తించారు.

టైటానికి శిథిలాల‌ను చూడ‌టానికి ప‌ర్య‌ట‌కులాను తీసుకెళ్ల‌డానికి ఇటీవ‌ల ఒక కంపెనీ ప్లాన్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఐదుగురితో గల్లంతైన టైటానిక్ పర్యాటక జలాంతర్గామిలో 96 గంటలకు స‌రిప‌డ మాత్ర‌మే ఆక్సిజ‌న్ గాలి అందుబాటులో ఉంటుంది. కెనడా, బోస్టన్ కోస్ట్ గార్డ్ లు గాలిస్తున్న గల్లంతైన ఓడ ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ అనే టూర్ ఆపరేటర్ కు చెందినది. లగ్జరీ అడ్వెంచర్ ట్రిప్పులను అందించే ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్  నౌక అదృశ్యమైనట్లు ధృవీకరించింది.

ప్రధాని అమెరికా పర్యటన.. హెచ్-1బీ వీసాలపై యూఎస్ కొత్త నిర్ణయం.. భారతీయులకు ఏ విధంగా ఉపయోగం అంటే ?

టైటానిక్ మునిగిపోయి 110 ఏళ్లు దాటినా ఇప్పటికీ దాని దురదృష్టం కొనసాగుతూనే ఉంది. నీటిలో మునిగిపోయిన దాని శిథిలాలను చూసేందుకు వెళ్లిన జలాంతర్గామి అదృశ్యమైంది. కొన్ని గంటల పాటు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉండటంతో లోపల ఉన్నవారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !