దారుణం.. భార్యకు మత్తుమందు ఇచ్చి, 51మంది పురుషులతో అత్యాచారం.. వీడియోలు రికార్డ్ చేసిన భర్త..

Published : Jun 22, 2023, 02:16 PM IST
దారుణం.. భార్యకు మత్తుమందు ఇచ్చి, 51మంది పురుషులతో అత్యాచారం.. వీడియోలు రికార్డ్ చేసిన భర్త..

సారాంశం

ప్రతీరోజు రాత్రి భార్యకు మత్తుమందు ఇచ్చి పరాయి పురుషులతో అత్యాచారం చేయించాడో భర్త. దాన్నంతా వీడియోలు తీసి దాచిపెట్టాడు. 

ఫ్రాన్స్‌ : ఓ వ్యక్తి తన భార్యకు రోజూ రాత్రి మత్తుమందు ఇచ్చి, ఆపై ఆమె మీద పలువురు పురుషులతో అత్యాచారం చేయించిన షాకింగ్ ఘటన ఫ్రాన్స్ లో వెలుగు చూసింది. ది టెలిగ్రాఫ్‌లో వచ్చిన కథనం ప్రకారం.. భార్యకు ఏ మాత్రం అనుమానం రాకుండా ఆ భర్త ఈ దారుణాన్ని 10 సంవత్సరాలపాటు కొనసాగించాడు. ఈ విషయం వెలుగు చూడడంతో దర్యాప్తు చేసిన అధికారులు.. 92 అత్యాచార కేసులను గుర్తించారు. 

దీనికి పాల్పడిన వారిలో యాభై ఒక్కమంది - 26 నుంచి 73 సంవత్సరాల మధ్య వయస్సు గలవారున్నారని గుర్తించారు. వీరిని అరెస్టు చేసి, అత్యాచార నేరం మోపినట్లు తెలిపారు. మిగతా వారికోసం వెతుకుతున్నారని ఆ కథనం తెలిపింది. వీరిలో ఫైర్‌మెన్, లారీ డ్రైవర్, మున్సిపల్ కౌన్సిలర్, బ్యాంకులో ఐటీ ఉద్యోగి, జైలు గార్డు, నర్సు, జర్నలిస్టులు కూడా ఉన్నారు.

డొమినిక్ పిగా గుర్తించబడిన సదరు ఫ్రెంచ్ వ్యక్తి, తన భార్య భోజనంలో యాంటి యాంగ్జయిటీ డ్రగ్ లోరాజెపామ్‌ను కలిపి ఇచ్చి.. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాతే ఈ దాడులకు పాల్పడ్డాడు. 'అతిథులు' అని చెబుతూ కొంతమందిని ఫ్రాన్స్‌లోని మజాన్‌లోని తమ ఇంటికి ఆహ్వానించాడు. ఆ తరువాత నిద్రిస్తున్న భార్యపై లైంగికదాడి చేయించాడు. బాధితురాలిని ఫ్రాంకోయిస్ అనే మారుపేరుతో టెలిగ్రాఫ్ తెలిపింది. 

ఇక ఆ భర్త.. అత్యాచారాలు చేయించడంతో ఆగలేదు. ఆ లైంగిక దాడులను వీడియోలు తీశాడు. ఆ ఫుటేజీ మొత్తాన్ని యూఎస్ బి డ్రైవ్‌లో భద్రపరిచాడు. ఇప్పుడా డ్రైవ్ పోలీసుల దగ్గర ఉంది. 2011- 2020 మధ్య ఈ అత్యాచారాలు జరిగాయని, చాలా మంది పురుషులు మళ్లీ మళ్లీ వచ్చారని పోలీసులు తెలిపారు.

డోమినిక్.. ఫ్రాంకోయిస్‌ ను వివాహం చేసుకుని తో 50 సంవత్సరాలకు పైగా అయ్యింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. "ఎ సన్ ఇన్సు" అని పిలువబడే ఒక ఇంటర్నెట్ ఫోరమ్‌లో అతనికి మిగతావారితో పరిచయం అయ్యింది. ఈ ఫోరమ్ లో సభ్యులు తమకు తెలియకుండానే చేసే లైంగిక చర్యల గురించి చర్చిస్తారు.  భాగస్వాములతో ఏకాభిప్రాయం కుదరదు కాబట్టి వారికి తరచుగా మత్తుపదార్థాలు ఇచ్చి ఇలాంటి పనులు చేస్తారు. 

చైనా రెస్టారెంట్‌లో గ్యాస్ లీక్‌తో పేలుడు.. 31 మంది మృతి..

పొగాకు, పెర్ఫ్యూమ్‌లాంటి ఘాటైన వాసనల వల్ల మత్తు వదిలి భార్య మధ్యలోనే లేవకుండా ఉండాలని వాటిని వాడనిచ్చేవాడు కాదట. అంతేకాదు ఇంటికి వచ్చే పురుషులను బాత్రూంలో కాకుండా.. వంటింట్లోనే బట్టలు విప్పేయమని చెప్పేవాడట. భార్య గదిలోకి వెళ్లేముందు వేడినీటితో చేతులు కడుక్కోమనేవాడు... శరీర ఉష్ణోగ్రతలో మార్పు తో ఆమె నిద్ర లేస్తుందని ఇలా చేసేవాడట. 

ఇంటి చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా.. వారి వాహనాలను దగ్గర్లో ఉన్న స్కూలు దగ్గర వదిలేసి.. చీకట్లో నడుచుకుంటూ తమ ఇంటికి రావాలని చెప్పేవాడట. దీనిమీద దర్యాప్తు చేస్తున్న అధికారులకు నిందితుల్లో కొందరు.. ఆమెకు తెలియకుండా జరుగుతుందన్న సంగతి తమకు తెలియదని చెప్పగా.. మరికొందరు ఆమె అతని భార్య.. అతను ఇష్టం వచ్చినట్టు చేస్తాడు అని అన్నారట.. 

ఇలా భార్య మీద అత్యాచారాలు చేయమని ఎవ్వరినీ డొమినిక్ బలవంతపెట్టడం కానీ, బెదిరించడం కానీ, హింసకు పాల్పడడం కానీ చేయలేదని ప్రాసిక్యూటర్‌లను ఉటంకిస్తూ ఫ్రెంచ్ వార్తాపత్రిక లే మోండే పేర్కొంది. "ప్రతి వ్యక్తి తాను ఇష్టపడే ఈ పని చేశాడు. ఇష్టం లేకపోతే వద్దనే స్వేచ్ఛ వారికి ఉంది’ అని తెలిపాడని పేర్కొంది. 

దాడి చేసిన వారిలో ఎవరూ కూడా "తన భార్యకు మెలుకువల వచ్చినా ఆమెపై లైంగిక చర్యలకు పాల్పడటం మానుకోవద్దని" అతను నొక్కి చెప్పాడు. ఈ అత్యాచార వీడియోలు విచిత్రంగా బయటపడ్డాయి. 2020లో డ్రెస్ చేంజింగ్ రూమ్ లలో మహిళలను చిత్రీకరించేందుకు రహస్య కెమెరాను ఉపయోగిస్తున్నట్లు పోలీసులకు అనుమానం వచ్చింది. 

దీంతో అతనిపై ప్రాథమిక విచారణ చేపట్టగా ఈ అత్యాచార వీడియోల గురించి బయటపడింది. ఈ టేపుల గురించి అతని భార్య అయిన బాధిత మహిళకు చెప్పినప్పుడు, ఆమె తీవ్ర షాక్ కు గురైంది. దానినుంచి బయటపడిన తరువాత ఆ మహిళ విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !