ఇజ్రాయెల్ దళాలు, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కు మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. దీంతో ఇరు వైపులా తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన మొదలైన నాటి నుంచి నేటి వరకు 1600 మందికి పైగా మరణించారు.
ఇజ్రాయెల్-పాలస్తీనాకు మధ్య మొదలైన సంక్షోభం తీవ్ర మారణహోమానికి కారణం అవుతోంది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో అమాయక పౌరులు, రెండు దేశాలకు చెందిన సైనికులు మృత్యువాత పడుతున్నారు. శనివారం నుంచి మొదలైన ఈ ఎదురుకాల్పుల్లో 1600 మంది మరణించారని నివేదికలు చెబుతున్నాయి.
షోపియాన్ లో ఎన్ కౌంటర్.. కాశ్మీర్ పండిత్ హత్య కేసులో ఉగ్రవాది సహా మరొకరు హతం..
undefined
మొత్తంగా నాలుగు రోజుల ప్రతిష్టంభన సమయంలో ఇజ్రాయెల్ దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించారని, 4,000 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే హమాస్ దాడి కారణంగా ఇజ్రాయెల్ లో కనీసం 900 మంది మరణించగా, 2,600 మంది గాయపడ్డారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ ఉగ్రవాద సంస్థ రహస్య స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయెల్ ఇప్పుడే హమాస్ పై దాడి చేయడం ప్రారంభించిందని ఆయన అన్నారు. ‘‘ఈ యుద్ధాన్ని మేం కోరుకోలేదు. అత్యంత క్రూరంగా మాపై బలవంతంగా రుద్దారు. ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ో ప్రారంభించకపోయినా.. మా దేశం దానిని అంతం చేస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభం.. హమాస్ దాడిలో కేరళ మహిళకు గాయాలు.. భర్తతో వీడియో కాల్ సమయంలో ఘటన..
నెతన్యాహు మంగళవారం చేసిన ట్వీట్ లో హమాస్ ను తీవ్రవాద ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో పోల్చారు. ‘‘హమాస్ అంటే ఐసిస్. ఐసిస్ ను ఓడించడానికి నాగరికత శక్తులు ఏకమైనట్లే, హమాస్ ను ఓడించడంలో నాగరికత శక్తులు ఇజ్రాయెల్ కు మద్దతు ఇవ్వాలి’’ అని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. గాజా స్ట్రిప్ పై సంపూర్ణ దిగ్బంధం విధిస్తున్నట్లు ఇజ్రాయెల్ సోమవారం ప్రకటించింది. ఈ ప్రాంతానికి ఆహారం, ఇంధనాన్ని అనుమతించడంపై నిషేధం విధించింది. శనివారం ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఈ ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో గాజా ఇప్పటికే పూర్తిగా విద్యుత్ సరఫరాను ఎదుర్కొంటోంది.
నెరవేరిన లతా మంగేష్కర్ చివరి కోరిక.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చిన కుటుంబం..
కాగా.. అమెరికా సైన్యం నుంచి ఇజ్రాయెల్ కు వైమానిక రక్షణ, మందుగుండు సామగ్రి, ఇతర భద్రతా సహాయం అందుతుండగా, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ మాస్కోలో పర్యటించే అవకాశం ఉందని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. హమాస్ తో కొనసాగుతున్న వివాదంలో ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్ డమ్ మంగళవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. హమాస్ ఉగ్రవాద చర్యలకు సమర్థన లేదని, చట్టబద్ధత లేదని, వాటిని విశ్వవ్యాప్తంగా ఖండించాలని స్పష్టం చేశారు. ఇలాంటి దురాగతాల నుంచి తనను, తన ప్రజలను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలకు తమ దేశాలు మద్దతిస్తాయని తెలిపింది.