కన్న తల్లి కర్కశత్వం.. పిల్లలు పుట్టిన తెల్లారే చంపేసి, ఫ్రిజర్ లో దాచిన మాతృమూర్తి.. ఎందుకలా చేసిందంటే ?

By Asianet News  |  First Published Jun 24, 2023, 9:38 AM IST

ఓ తల్లి తన బిడ్డల పట్ల కర్కశంగా వ్యవహరించింది. శిశువులు జన్మించిన మరుసటి రోజే వారిని చంపేసింది. అనంతరం డెడ్ బాడీలను ఫ్రీజర్ లో దాచిపెట్టింది. ఈ ఘటన దక్షిణ కొరియాలో జరిగింది. 


ఓ మహిళ తన కన్నబిడ్డలపై క్రూరంగా ప్రవర్తించింది. పసికూనలు అని కూడా చూడకుండా వారి గొంతు నులిమి చంపేసింది. అనంతరం వారి డెడ్ బాడీలను ఫ్రీజర్ లో దాచి పెట్టింది. పిల్లలు జన్మించిన మరునాడే ఈ దారుణానికి పాల్పడటం విచారకరం. ఈ విషయం భర్తకు తెలియకుండా జాగ్రత్త పడింది. కానీ ఇటీవల అధికారులు జరిపిన ఆడిట్ లో ఈ విషయం బయటపడింది.

మహిళా ట్యూషన్ టీచర్ తో పారిపోయిన విద్యార్థిని.. మేజర్ అయిన తరువాత కలిసి జీవిస్తామంటూ పోలీసులతోనే..

Latest Videos

దక్షిణ కొరియాలో చోటు చేసుకున్న ఈ దారుణానికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సియోల్ పరిధిలో ఉన్న సువాల్ లో ఓ 30 ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి నివసిస్తోంది. వీరి ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు. ఈ జంటకు 8, 10, 12 ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే వీరి ఆర్థిక పరిస్థితి వల్ల కుటుంబ పోషణ కష్టంగా మారింది. 

ఈ క్రమంలో ఆమె మళ్లీ గర్భం దాల్చింది. 2018 సంవత్సరంలో పండంటి ఆడపిల్లను ప్రసవించింది. కానీ ఆడపిల్ల జన్మించిందనే ఆనందం ఆమెలో ఇసుమంతైనా కలుగలేదు. ముగ్గురు పిల్లల పోషణే భారమవుతున్న ఈ తరుణంలో నాలుగో బిడ్డను ఎలా సాకాలనే ఆందోళన ఆమెలో కలిగింది. దీంతో ఓ క్రూరమైన నిర్ణయాన్ని ఆ మహిళ తీసుకుంది. ఆ పసిబిడ్డ పుట్టిన తెల్లారే గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఆ డెడ్ బాడీని ఫ్రీజర్ లో ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టింది. 

డబ్బాను మింగిన పాము.. ఆపరేషన్ తో తొలగింపు..

మళ్లీ 2019 సంవత్సరంలో కూడా ఆ మహిళకు ఐదో సంతానం కలిగింది. ఈ సారి మగబిడ్డ జన్మించాడు. ఈ సారి కూడా ఆమెకు సంతోషం కలుగలేదు. క్రితం సారి కలిగిన ఆందోళనే ఈ సారి కూడా కలిగింది. దీంతో మళ్లీ ఆ బిడ్డను అలాగే చంపేసింది. ఫ్రీజర్ లో దాచింది. కానీ ఈ విషయాన్ని భర్తకు చెప్పలేదు. అసలు విషయం చెబితే బాగుండదని భావించి.. గర్భం దాల్చిన రెండు సార్లు తాను ఆబార్షన్ చేయించుకున్నాని ఆయనకు చెప్పింది. దీంతో భర్త ఆ విషయం నమ్మి, ఎలాంటి అనుమానమూ వ్యక్తం చేయలేదు. 

కాగా.. ఈ ఇటీవల ఆ మహిళ ప్రసవించిన హాస్పిటల్ లో ప్రభుత్వ అధికారులు ఆడిట్ నిర్వహించారు. ఆ హాస్పిటల్ రికార్డుల్లో ఆ మహిళకు ఇద్దరు పిల్లలు జన్మించారని ఉంది. కానీ ఆ మహిళ వద్ద గతంలో ఉన్న ముగ్గురు పిల్లలు మాత్రమే ఉన్నారు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. మహిళ ఇంట్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో మహిళను విచారించగా అసలు నిజం వెలుగు చూసింది. ఈ ఘటనలో మహిళ తన నేరాన్ని అంగీకరించింది. దీంతో ఆమెను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
 

click me!