
PM Modi's US Visit: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ చారిత్రాత్మక పర్యటనలో ప్రధాని చాలా బిబీబిబీగా గడుపుతూ.. అమెరికాతో పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ తరుణంలో ఎఫ్‌ఐఎ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్) న్యూయార్క్‌లోని హడ్సన్ నదిపై 250 అడుగుల పొడవైన బ్యానర్‌ను ఎగురవేసి, చారిత్రాత్మక యుఎస్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికింది.
న్యూయార్క్ ఆకాశవీధుల్లో పెద్ద బ్యానర్‌ను లాగుతున్న విమానం మోడీ స్వాగత సందేశాన్ని తీసుకెళ్తుంది. "యుఎస్‌ఎలో చారిత్రక పర్యటన" అని బ్యానర్‌లో పిఎం మోడీ, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఫోటోలు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో వేదిక పంచుకుంటూ "అమెరికాలోని న్యూయార్క్ ఆకాశ వీధుల్లో " అని అన్నారు. అదేసమయంలో ప్రధానమంత్రి మోదీ పర్యటన నేపథ్యంలో న్యూయార్క్‌లోని ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ , నయాగరా జలపాతాన్ని భారత జెండా రంగులలో వెలిగించారు.
ప్రధాని తన పర్యటనలో అనేక మంది అమెరికన్ పౌరులు, థింక్ ట్యాంక్‌లు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, ఐటీ అండ్ టెక్ రంగానికి సంబంధించిన అనుభవజ్ఞులతో సంభాషించారు. అమెరికాలో ఎక్కడికి వెళ్లిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలుతున్నారు ప్రవాస భారతీయులు. ముక్తకంఠంతో ప్రధాని మోడీకి జై.. భారత మాతకు జై. అంటూ నినదిస్తున్నారు.
ఇదిలాఉంటే.. శుక్రవారం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లు ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం విదేశాంగ శాఖలో లంచ్ ఏర్పాటు చేశారు. అంతకు ముందు ప్రధాని మోడీ నేడు టాప్ సీఈఓలతో కీలక భేటీ అయ్యారు. వైట్‌హౌస్‌లో జరిగిన హైటెక్ హ్యాండ్‌షేక్ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు, జో బిడెన్ సీఈవోలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ, జెరోధా, ట్రూ బీకాన్ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తదితరులు పాల్గొన్నారు.