92వ ఏటా ఐదోసారి పెళ్లికి సిద్ధమైన మీడియా మొఘల్.. రూపర్ట్ మర్దోక్, యాన్ లెస్లీ స్మిత్‌ల లవ్ స్టోరీ ఇలా మొదలైంది

Published : Mar 21, 2023, 02:50 PM IST
92వ ఏటా ఐదోసారి పెళ్లికి సిద్ధమైన మీడియా మొఘల్.. రూపర్ట్ మర్దోక్, యాన్ లెస్లీ స్మిత్‌ల లవ్ స్టోరీ ఇలా మొదలైంది

సారాంశం

మీడియా మొఘల్, బిలియనీర్ రూపర్ట్ మర్దోక్ తన 92వ యేటా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకుని విడిపోయిన ఆయన ఇప్పుడు యాన్ లెస్లీ స్మిత్‌తో ఐదో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వారికి ఎంగేజ్‌మెంట్ జరిగింది.  

న్యూఢిల్లీ: మీడియా మొఘల్, బిలియనీర రూపర్ట్ మర్దోక్ తన 92వ యేటా ఐదోసారి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన సొంత టాబ్లాయిడ్ న్యూయార్క్ పోస్టు సోమవారం వెల్లడించింది. 92 ఏళ్ల రూపర్ట్ మర్దోక్, 66 ఏళ్ల యాన్ లెస్లీ స్మిత్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. నాకు తెలుసు ఇదే నా చివరి పెళ్లి అవుతుంది అని మర్దోక్ చెప్పడం గమనార్హం.

‘నేను చాలా నర్వస్‌కు గురయ్యా. ప్రేమలో పడటానికి ఎంతో భీతిల్లాను. కానీ, నాకు తెలుసు ఇదే చివరిదని. ఈ ప్రేమ బాగుటుంది. నేను సంతోషంగా ఉన్నాను’ అని ఆయన న్యూయార్క్ పోస్టుకు తెలిపాడు.

ముర్దోక్ వ్యాపార సామ్రాజ్యం అమెరికా, ఇంగ్లాండ్‌ వరకు విస్తరించి ఉన్నది. ఆయన మీడియాలో రారాజుగా వెలుగుతున్నాడు. అమెరికాలోని ఫాక్స్ న్యూస్, యూకేలోని రైట్ వింగ్ టాబ్లాయిడ్ సన్‌లకు ఆయనే యజమాని. అంతేకాదు, న్యూయార్క్ పోస్టు, వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి న్యూస్ కార్పొరేషన్స్‌కు హెడ్. హార్పర్ కాలిన్స్ పబ్లిషింగ్ హౌజ్ కూడా ఆయనదే.

ఈ జంట వేసవిలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నది. 

అలా లవ్ స్టోరీ మొదలు..

మర్దోక్, యాన్ లెస్లీ స్మిత్‌లు 2022 సెప్టెంబర్‌లో తొలిసారి కలుసుకున్నారు. కాలిఫోర్నియాలో ఆయన మొరాగా వైన్ యార్డ్‌లో 200 మంది పాల్గొన్న ఓ కార్యక్రమంలో వీరు కలుసుకున్నారు. ‘నేను ఆమెను అప్పుడే కలుసుకున్నాను. కొద్దిగా మాట్లాడాను. రెండు వారాల తర్వాత నేను ఆమెకు కాల్ చేశాను’ అని మర్దోక్ తెలిపాడు.

Also Read: హిందుత్వపై అభ్యంతరకర ట్వీట్.. కన్నడ నటుడు చేతన్ కుమార్ అరెస్టు.. ఏమని ట్వీట్ చేశాడంటే?

మర్దోక్ ఇది వరకే నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు. ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చాడు. ప్యాట్రీషియా బుకర్, అన్నా మాన్, వేండి డేంగ్‌లను పెళ్లి చేసుకున్నాడు. చివరిగా నాలుగో భార్యగా సూపర్ మాడల్ జెర్రీ హాల్ ఉన్నది. వీరిద్దరు 2022లో విడిపోయారు. 

యాన్ స్మిత్ కూడా గతంలో రెండు సార్లు పెళ్లి చేసుకుంది. ‘నేను 14 ఏళ్లుగా వితంతుగా ఉన్నాను. రూపర్ట్ లాగే నా భర్త కూడా బిజినెస్‌మ్యాన్. లోకల్ పేపర్లకు పని చేశాడు. రేడియో స్టేషన్, టీవీ స్టేషన్లు డెవలప్ చేశాడు. యునివిజన్ ప్రమోట్ చేయడంలో సహకరించాడు’ అని యాన్ స్మిత్.. మరణించిన తన భర్త గురించి వివరించింది.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !