మాలిలో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించినట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
మాలి : ఉత్తర మాలిలోని నైజర్ నదిలో ఆర్మీ బేస్,ప్రయాణీకుల పడవపై గురువారం అనుమానిత జిహాదీలు జరిపిన దాడిలో 64 మంది మరణించినట్లు మాలియన్ అధికారి ఒకరు తెలిపారు.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం, రెండు వేర్వేరు దాడులు జరిగాయి. ఇవి నైజర్ నదిపై టింబక్టు పడవను, ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద ఆర్మీ పొజిషన్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి, "తాత్కాలికంగా 49 మంది పౌరులు, 15 మంది సైనికులు మరణించారు" అని ప్రకటించారు.
అయితే, ఆర్మీ ప్రతి దాడిలో ఎంతమంది మరణించారో ఆ ప్రకటనలో పేర్కొనలేదు. అయితే ఈ దాడులు అల్-ఖైదాకు అనుబంధంగా ఉన్న ఓ గ్రూపు ఈ దాడులు తామే చేశామని తెలిపింది. అంతకుముందు సోషల్ మీడియాలో టూరిస్ట్ బోట్‌పై "సాయుధ తీవ్రవాద గ్రూపులు" దాడి చేశాయని మాలియన్ ఆర్మీ తెలిపింది.
అమెరికా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి రెడీ.. బైడెన్ నిర్వర్తించలేకపోతే..: కమలా హ్యారిస్
నది వెంబడి ఉన్న నగరాల మధ్య ఏర్పాటు చేసిన మార్గంలో ప్రయాణిస్తున్న ఈ నౌక మీద "కనీసం మూడు రాకెట్ల"తో దాడి చేశారు. ఈ రాకెట్లు పడవ ఇంజిన్‌లను లక్ష్యంగా చేసుకున్నాయని ఆపరేటర్ కొమనవ్ చెప్పారు.
దాడి నేపథ్యంలో నౌకను నదిలో కదలకుండా లంగర్ వేశారు. సైన్యం ప్రయాణీకులను ఖాళీ చేయిస్తోందని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫొటోల్లో నదిపై నల్లటి పొగ మేఘం ఆవరించి ఉంది. ఈ సంఘటన ఒక మారుమూల ప్రాంతంలో జరిగింది. ఫొటోలను స్వతంత్రంగా ధృవీకరించడం సాధ్యం కాలేదు.
దాడి జరిగిన ప్రాంతంోబ రహదారి మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్న, రైల్వేలు లేని ప్రాంతం కావడంతో నైజర్ ఒక ముఖ్యమైన రవాణా లింక్ గా ఉంది. ఉత్తర మాలిలోని చారిత్రక కూడలి నగరమైన టింబక్టును దిగ్బంధిస్తున్నట్లు అల్-ఖైదా అనుబంధ కూటమి, ఇస్లాం, ముస్లింల సపోర్ట్ గ్రూప్ (జీఎస్ఐఎం) గత నెలలో ప్రకటించిన తర్వాత ఈ దాడి జరిగింది.
టువరెగ్స్ నేతృత్వంలో మాలిలోని సమస్యాత్మకమైన ఉత్తర ప్రాంతంలో 2012లో తిరుగుబాటు చెలరేగింది. అప్పటి నుండి పేద రాష్ట్రం అభద్రతతో పోరాడుతోంది. తిరుగుబాటును జిహాదీలు ప్రోత్సహించారు. వారు మూడు సంవత్సరాల తరువాత సెంట్రల్ మాలి, నైజర్, బుర్కినా ఫాసోలలో స్వంత ప్రచారాన్ని చేపట్టారు.
ఉత్తర మాలిలో, 2015లో తిరుగుబాటుదారులు, మాలియన్ ప్రభుత్వం మధ్య శాంతి ఒప్పందాల మీద సంతకాలు జరిగిన తరువాత ప్రాంతీయ తిరుగుబాటు అధికారికంగా ముగిసింది. అయితే, 2020లో పౌర ప్రభుత్వం పడిపోయి.. దాని స్థానంలో జుంటా ఏర్పడిన తర్వాత ఈ ఒప్పందం ప్రశ్నార్థకంలో పడింది.
మాలిలోని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక మిషన్ సంవత్సరం చివరిలోగా వెళ్లిపోవాలని చెప్పారు. టింబక్టు సమీపంలోని రెండు స్థావరాలను సాయుధ దళాలకు అప్పగించిన తర్వాత ఇటీవలి వారాల్లో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇలా అప్పగించడం సైన్యం, జిహాదీల మధ్య ఘర్షణలను ప్రేరేపించింది. మాజీ తిరుగుబాటుదారులలో కోపంతో కూడిన షోడౌన్‌కు దారితీసింది, 2015 శాంతి ఒప్పందం మీద భయాలను రేకెత్తించింది.