తాలిబన్ ఉగ్రవాదుల దాడుల్లో 37 మంది జవాన్ల మృతి

By rajesh yFirst Published Sep 10, 2018, 7:25 PM IST
Highlights

ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్థానల్ లోని పలు ప్రాంతాల్లో జరిపిన ఉగ్రదాడుల్లో 37 మంది జవాన్లను బలితీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెక్ పాయింట్ లనే టార్గెట్ చేసిన తాలిబన్లు వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపారు. 

కాబుల్: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్థానల్ లోని పలు ప్రాంతాల్లో జరిపిన ఉగ్రదాడుల్లో 37 మంది జవాన్లను బలితీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెక్ పాయింట్ లనే టార్గెట్ చేసిన తాలిబన్లు వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపారు. ఈ దాడుల్లో 37 మంది జవాన్లు మృతి చెందగా...ముగ్గురు తాలిబన్లు సైతం మరణించారు. అలాగే 18 మంది జవాన్లు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.  
 
దస్తి ఆర్చి జిల్లాలోని చెక్ పాయింట్‌పై జరిగిన దాడిలో 13 మంది జవాన్లు మరణించారని పోలీస్ ఉన్నతాధికారి మహ్మద్ జజ్వానీ తెలిపారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 15 మంది మరణించారని పేర్కొన్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు భీకర కాల్పులు జరిపారని అందుకు ప్రతిగా జవాన్లు కూడా కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఆదివారం ఆర్థరాత్రి సమయంలో ముష్కరులు ఈ దారుణానికి పాల్పడినట్లు స్పష్టం చేశారు.  

అలాగే ఖమ్యాబ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో మరికొంత మంది జవాన్లు మృతి చెందారని మరో పోలీసు అధికారి యూసఫ్ తెలిపారు.క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. 18 మంది జవాన్లు ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు తెలిపారు. తాలిబన్లు దాదాపుగా 8 మంది వరకు  చనిపోయి ఉండొచ్చిన అయితే ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. 

Latest Videos

click me!