భార్య, ముగ్గురు పిల్లలు, అత్తను దారుణంగా చంపేశాడు

First Published 10, Sep 2018, 4:54 PM IST
Highlights

పిల్లలతో ఎప్పుడూ సందడిగా ఉండే ఇళ్లు ఒక్కసారిగా మూగపోయింది ఏంటా అనే అనుమానం కలిగిందని.. కానీ హత్యకు గురయ్యారని మాత్ర గుర్తించలేకపోయామని స్థానికులు తెలిపారు. 

ఓ యువకుడు తన భార్య, ముగ్గురు పిల్లలు, అత్తను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఆంటోనీ రాబర్ట్ హార్వే(24)కి పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇతని వయసు 24 సంవత్సరాలు కాగా.. భార్య వయసు 41 కావడం గమనార్హం.

వారం రోజుల క్రితం ఆంటోనీ రాబర్ట్.. తన భార్య మరా(41), మూడేళ్ల కూతురు చార్లొట్టే, రెండేళ్ల వయసు గల మరో ఇద్దరు కవల పిల్లలు, అత్త  బేవర్లీ(73)లను పదునునైన వస్తువులు, కత్తులతో పొడిచి అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్యలు చేసిన వారం రోజుల తర్వాత తనంతట తానే వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.

అతను చెప్పిన ప్రకారం.. అక్కడికి వెళ్లిచూడగా.. ఈ దారుణం బయటపడింది.పిల్లలతో ఎప్పుడూ సందడిగా ఉండే ఇళ్లు ఒక్కసారిగా మూగపోయింది ఏంటా అనే అనుమానం కలిగిందని.. కానీ హత్యకు గురయ్యారని మాత్ర గుర్తించలేకపోయామని స్థానికులు తెలిపారు. 

ఐదుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే.. అసలు ఆంటోని ఈ హత్యలకు పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఆంటోని ఈ హత్యలు చేశాడని తెలిసి ఇరుగుపొరుగు వారు కూడా షాక్ కి గురయ్యారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated 19, Sep 2018, 9:22 AM IST