ఇంటి కోసం పునాది... బయటపడ్డ వందలాది గోల్డ్ కాయిన్స్

By ramya neerukondaFirst Published 10, Sep 2018, 5:15 PM IST
Highlights

తవ్వకాల్లో బయటపడ్డ ఓ రాతి పాత్రలో ఇవి లభించినట్లు పేర్కొంది.
 

పాతపడిపోయిన భవనాలను కూల్చివేసి.. కొత్తగా భవనాలను కట్టడానికి పునాది తవ్వుతుంటే.. వందలాది బంగారు నాణేలు బయటపడ్డాయి. ఈ సంఘటన ఇటలీలో జరిగింది. ఈ విషయాన్ని ఇటలీ సాంస్కృతిక మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించింది. తవ్వకాల్లో బయటపడ్డ ఓ రాతి పాత్రలో ఇవి లభించినట్లు పేర్కొంది.
 
ఉత్తర ఇటలీలోని ఓ ప్రాంతంలో ఉన్న పాత థియేటర్‌ను కూల్చేసి, కొత్తగా నివాస భవనాల్ని నిర్మించాలనుకున్నారు. దాంట్లో భాగంగా బేస్‌మెంట్ పనులను ప్రారంభించారు. పనులు కొనసాగుతుండగా ఒక రాతి పాత్ర కనిపించింది. పనుల్లో భాగంగా అది కొంత పగిలిపోయింది. అయితే ఆ పాత్ర తీసి చూడగా వందల కొద్ది రోమన్ బంగారు నాణేలు కనిపించాయి. ఈ విషయాన్ని ఇటలీ సంస్కృతిక మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్ ద్వారా తెలియజేసింది. దీంతో పాటు కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది.
 
దీని గురించి సదరు శాఖ మంత్రి అల్బెర్టో బొనిసొలి మాట్లాడుతూ ‘దీని గురించిన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఏంటో ఇంకా వివరంగా తెలియదు. కానీ ఈ ప్రాంతం మన పురాతత్వానికి నిజమైన నిధి’ అని అన్నారు.

Last Updated 19, Sep 2018, 9:22 AM IST