ఆప్ఘనిస్తాన్ లో పాక్ పాత్ర.. నిఘా ఉంచాలి.. జో బైడెన్..!

By telugu news teamFirst Published Sep 25, 2021, 7:55 AM IST
Highlights

పాకిస్తాన్ విషయంలో అందరూ నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో బైడెన్ అంగీకరించారు. ఆ ప్ఘనిస్తాన్ లో సమస్యలకు.. పాకిస్తాన్ కూడా కారణమని బైడెన్ అంగీకరించారు. 

భారత ప్రధాని  నరేంద్రమోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా..ఈ సందర్భంగా.. మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  తో భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా మోదీ, బైడెన్ లు పలు విషయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సమావేశంలో పాకిస్తాన్ చర్చ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

పాకిస్తాన్ విషయంలో అందరూ నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో బైడెన్ అంగీకరించారు. ఆ ప్ఘనిస్తాన్ లో సమస్యలకు.. పాకిస్తాన్ కూడా కారణమని బైడెన్ అంగీకరించారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. బిడెన్‌తో మొదట వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత  ఆస్ట్రేలియా,  జపాన్ నాయకులతో విస్తృత "క్వాడ్" శిఖరాగ్రంలో పాల్గొన్నారు. చర్చల సమయంలో, గత నెలలో తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాద అంశాల గురించి ఆందోళనలను ప్రధాని మోదీ పంచుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఆప్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ పాత్రను మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని బైడెన్ పేర్కొన్నారు. తీవ్రవాదం విషయంలో పాకిస్తాన్ పాత్ర స్పష్టంగా ఉందని బైడెన్ అంగీకరించారని.. భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ శ్రింగ్లా పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. ఆప్ఘనిస్తాన్ ని ఇటీవల తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. కాబూల్ ని తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో.. అక్కడ తాలిబన్లకు పాకిస్తాన్ మద్దతుగా నిలుస్తుందనే ప్రచారం ఉంది. కాగా.. దాదాపు చాలా సంవత్సరాల తర్వాత.. అమెరికా బలగాలు కూడా వెనక్కి వచ్చేసిన సంగతి తెలిసిందే. 

click me!