ఆఫ్ఘనిస్తాన్: తాలిబన్ల అరాచకాలు మొదలు... జలాలాబాద్‌లో ప్రజలపై కాల్పులు

By Siva KodatiFirst Published Aug 18, 2021, 4:37 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు మొదలయ్యాయి. జలాలాబాద్‌బాద్‌లో తాలిబన్ల జెండా తీసేసి ఆఫ్గనిస్తాన్ జాతీయ పతాకం ఎగురవేయడంతో స్థానికులపై వారు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కొందరు చనిపోయినట్టు తెలుస్తోంది
 

అనుకున్నదంతా జరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అకృత్యాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఎదురు మాట్లాడిన వారిపై తూటాల వర్షం కురిపిస్తున్నారు తాలిబన్లు. జలాలాబాద్‌బాద్‌లో స్థానికులపై తాలిబన్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తాలిబన్ల జెండా తీసేసి ఆఫ్గనిస్తాన్ జాతీయ పతాకం ఎగురవేయడంతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు  తీశారు. ఈ కాల్పుల్లో కొందరు చనిపోయినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

Also Read:కాబూల్ నుంచి హెలికాప్టర్ నిండా డబ్బు తీసుకెళ్లారు: అష్రఫ్ ఘనీపై రష్యా అధికారి

మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ఇక, ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆ దేశ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో తాలిబన్ అగ్రనేతలు సమావేశమయ్యారు. అనాస్ హక్కానీ నేతృత్వంలోని తాలిబన్ నేతలు ఆయనతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఇస్లామిక్ చట్టాలకు లోబడి మహిళల హక్కులను కాపాడతామని వారు హామీ ఇచ్చారు. ఇకపై తాలిబన్ నేతలెవరూ చీకట్లో దాక్కోరని, ప్రపంచం ముందుకు వస్తారని తాలిబన్ నేత ఒకరు చెప్పారు. కాగా, తాలిబన్లు భారీగా అమెరికా రక్షణ వ్యవస్థలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు
 

click me!