హైతీ భూకంపం.. 2వేలకు చేరిన మృతులు, తినడానికి తిండిలేక..

By telugu news teamFirst Published Aug 18, 2021, 10:41 AM IST
Highlights

కాగా.. ప్రాణాలతో బయటపడిన తర్వాత కూడా తినడానికి తిండి లేక అలమటించిపోతున్నారు. కనీసం వారికి.. నివసించడానికి కూడా షెల్టర్ కూడా లేదు.. గాయాలాపాలైన క్షతగాత్రులు.. మెడికల్ కేర్ కోసం ఎదురు చూస్తున్నారు. 


హైతీలో ఇటీవల భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.  కాగా.. ఆ భూకంపం  పెను విధ్వంసమే సృష్టించింది. గత శనివారం ఈ భూకంపం సంభవించగా.. అక్కడి పెద్ద పెద్ద భవనాలన్నీ నేలకూలిపోయాయి. ఆ శిథిలాల కింద కుప్పలు తెప్పలుగా శవాలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇప్పటి వరకు ఈ భూకంపం ధాటికి దాదాపు 2వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

కాగా.. ప్రాణాలతో బయటపడిన తర్వాత కూడా తినడానికి తిండి లేక అలమటించిపోతున్నారు. కనీసం వారికి.. నివసించడానికి కూడా షెల్టర్ కూడా లేదు.. గాయాలాపాలైన క్షతగాత్రులు.. మెడికల్ కేర్ కోసం ఎదురు చూస్తున్నారు. 

కాగా.. ఇప్పటికే భూకంపం ధాటికి జనం విలవిలలాడుతుండగా.. తుఫాను ప్రభావంతో కుండపోత వర్షం కురుస్తున్నది. ఆ వర్షానికి వరదలు రావడం కూడా మొదలయ్యాయి. 

పోర్ట్-ఓ-ప్రిన్స్‌కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో శనివారం తెల్లవారు జామున భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 9,900 మందికిపైగా గాయపడగా.. 76వేలకుపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. విపత్తు కారణంగా అర మిలియన్లకుపైగా పిల్లలు ప్రభావితమయ్యారని యూనిసెఫ్‌ తెలిపింది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో తీర ప్రాంత పట్టణమైన లెస్‌కేస్‌లో నిర్వాసితులు ఫుట్‌బాల్‌ మైదానాలు, చర్చిల్లో ఆశ్రయం పొందారు.

కాగా.. తమ దగ్గర కనీసం డాక్టర్ కూడా లేరని.. తినడానికి తిండి కూడా లేదని బాధితులు వాపోతున్నారు. సహాయం చేయాలంటూ ప్రార్థిస్తున్నారు. కనీసం బాత్రూమ్ సదుపాయం కూడా లేదని.. నిద్రపోవడానికి సరైన షెల్టర్ లేదని.. వర్షానికి తడిచిపోతున్నామని కనీసం.. గొడుగులైనా ఇవ్వాలని కోరుతున్నారు. మరి వారి బాధలను ప్రభుత్వం ఎంత వరకు పట్టించుకుంటుందో చూడాలి.

click me!