సుషీ టెర్రరిజం : ఆహార పదార్థాలను ఎంగిలిచేస్తూ ప్రాంక్.. ముగ్గురు అరెస్ట్...

Published : Mar 09, 2023, 12:19 PM ISTUpdated : Mar 09, 2023, 12:22 PM IST
సుషీ టెర్రరిజం : ఆహార పదార్థాలను ఎంగిలిచేస్తూ ప్రాంక్.. ముగ్గురు అరెస్ట్...

సారాంశం

సోయా సాస్ లో ఉమ్మడం, కన్వేయర్ బెల్టు మీది ఆహారాలను ఎంగిలి చేయడం.. గ్లాసులకు ఉమ్మురాయడం.. లాంటి చర్యలకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను జపాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

టోక్యో : జపాన్‌లో కన్వేయర్ బెల్ట్ సుషీ రెస్టారెంట్‌లోని ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అపరిశుభ్రతను బయటపెట్టింది. సుషీ టెర్రరిజం పేరుతో ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ ఫ్రాంక్ తో జనాల్ని భయాందోళనలకు గురిచేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే అరెస్టులు జరిగాయి.

ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఓ ముగ్గురు వ్యక్తులు ఓ సూషీ రెస్టారెంట్ కి వెళ్లారు. అక్కడ ఓ టేబుల్ దగ్గర తమ ఆర్డర్ ను తీసుకున్నారు. ఆ తరువాత కన్వేయర్ బెల్టు మీద వస్తున్న పదార్థాలను ఎంగిలి చేయడం మొదలు పెట్టారు. గ్లాసులను నోట్లో పెట్టుకుని ఎంగిలిచేసి పెట్టడం.. నోట్లో వేలు పెట్టుకుని ఆ ఉమ్ముతో సుషీని ముట్టుకోవడం.. తమ టేబుల్ దగ్గరున్న సోయా సాస్ బాటిల్ లో ఉమ్మి.. ఏమీ తెలియనట్లు పెట్టేయడం కనిపిస్తుంది. 

చైనీస్ రెస్టారెంట్ లో అమెరికా యువకుల అరాచకం.. లోపలికి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం.. వీడియో వైరల్

ఈ ఫ్రాంక్ వీడియో వైరల్ కావడంతో ఆ రెస్టారెంట్ కు వెళ్లే కస్టమర్లు తీవ్రంగా స్పందించారు. ఇంత అపరిశుభ్రతను కనుక్కోలేకపోయారని.. దీనిమీద ఫిర్యాదులు చేశారు. దీంతో సెంట్రల్ ఐచి ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు గురువారం  తెలిపారు. 21 ఏళ్ల ర్యోగా యోషినో, పేరు తెలియని 15 ఏళ్ల అమ్మాయిని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసు ప్రతినిధి ఒకరు తెలిపారు, ఈ గ్రూప్ లోని మూడవ సభ్యుడు, 19 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. 

ఇటీవలి కాలంలో జపాన్ లో ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. పరిశుభ్రతకు పెద్దపీట వేసే జపాన్ లో ఇలాంటి ఫ్రాంక్ లు తీవ్ర అలజడికి కారణమవుతున్నాయి. ఈ ఫ్రాంక్ ల వరుసలో ఈ అరెస్టులే మొదటివి. ఇలా చేయడం వల్ల రెగ్యులర్ కస్టమర్లలో తమ రెస్టారెంట్ పరువు పోతుందని.. వారిలో అపనమ్మకం కలుగుతుందని యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తుంది. 

13యేళ్ల బాలుడితో గర్భం దాల్చిన 31 యేళ్ల మహిళ.. కోర్టు ఏమందంటే...

ఇది తమ వ్యాపారానికి పెద్ద దెబ్బగా మారుతుందని వారంటున్నారు. ఇలాంటి చర్యలకు జపాన్ చట్టం ప్రకారం కఠినమైన జరిమానాలు ఉంటాయి. మూడు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. జపాన్‌లో దాదాపు 500 అవుట్‌లెట్‌లను కలిగి ఉన్న కురా సుషీని నిర్వహిస్తున్న కంపెనీ ఒక ప్రకటనలో అరెస్టులను స్వాగతించింది.

"కస్టమర్‌లతో ఉన్న నమ్మకాన్ని బట్టి మా సిస్టమ్‌ను ప్రాథమికంగా దెబ్బతీసే ఈ చిలిపి పనులు నేరమని, భవిష్యత్తులో ఎలాంటి కాపీక్యాట్ చర్యలు ఉండవని ఈ అరెస్టులు సమాజంలో అవగాహన కల్పిస్తాయని  హృదయపూర్వకంగా ఆశిస్తున్నాం అని సంస్థ తెలిపింది. ఈ వీడియో వెలుగు చూడడంతో కస్టమర్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కన్వేయర్ బెల్టు రెస్తారెంట్లకు ఇక ముందు వెళ్లనని ఓ కస్టమర్ స్పందించాడు. 

 

PREV
click me!

Recommended Stories

20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..
India Oman: మోదీ మాస్ట‌ర్ ప్లాన్, ఒమాన్‌తో కీల‌క ఒప్పందం.. దీంతో మ‌న‌కు లాభం ఏంటంటే..