Sunita Williams: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఉండిపోయిన విషయం తెలిసిందే. సునీతతోపాటు బచ్‌విల్మోర్ అనే మరో వ్యోమగామి కొన్ని సాంకేతిక కారణాలతో అంతరిక్షంలోనే ఉండిపోయారు. అయితే తాజాగా వీళ్లు తిరిగి భూమిపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు..
Sunita Williams: అంతరిక్ష కేంద్రంలో ఇరుక్కుపోయిన సునీతా విలియమ్స్ దాదాపు 9 నెలల నుంచి అంతరిక్షంలోనే ఉండిపోయిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్న బచ్‌విల్మోర్‌ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. అయితే తాజాగా నాసా, స్పేస్‌ఎక్స్ కలిసి నిర్వహించిన క్రూ10 మిషన్ ఆశలను చిగురించేలా చేశాయి.
నిజానికి ఈ క్రూ 10 మిషన్‌ను గురువారం చేపట్టాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యల వల్ల మిషన్ వాయిదా పడింది. అయితే సాంకేతిక సమస్యలను పరిష్కరించిన తర్వాత ఎట్టకేలకు మిషన్‌ను ప్రారంభించారు. నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సుల్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.
Have a great time in space, y'all!
lifted off from at 7:03pm ET (2303 UTC) on Friday, March 14. pic.twitter.com/9Vf7VVeGev
ఈ ప్రయోగంద్వారా నలుగురు వ్యోమగాములు మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్తున్నారు. ఈ మిషన్ సహాయంతో త్వరలోనే సునీత భూమిపైకి తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి.
సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ గత ఏడాది జూన్‌లో అంతరిక్ష స్టేషన్ (ISS)కు వెళ్లారు. సాధారణంగా 8 రోజుల్లో ముగించాల్సిన ఈ ప్రయాణం. బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సమస్య రావడంతో నెలల తరబడి పొడగించారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ సాంకేతిక సమస్య రాజకీయ చర్చకు దారితీసింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలోన్ మస్క్ (స్పేస్‌ఎక్స్ అధినేత) ఆ సమయంలో అధికారంలో ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ కావాలనే వారిని విస్మరించారని ఆరోపించారు.
58 ఏళ్ల సునీత, 61 ఏళ్ల బుచ్ జూన్ 5, 2024న బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో ప్రయాణించారు. తిరిగి వస్తున్నప్పుడు, స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక థ్రస్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. అప్పటి నుంచి సునీత, బుచ్ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. దాదాపు 9 నెలలు అయ్యింది. నాసా-స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా వారిని తిరిగి వచ్చే మిషన్‌ను నిర్వహిస్తున్నాయి. కాగా వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చే బాధ్యతను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్‌కు అప్పగించారు.