ఎన్నికల ర్యాలీలో ఆత్మాహుతి దాడి, 14 మంది మృతి

First Published Jul 11, 2018, 11:02 AM IST
Highlights

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఎన్నికల ర్యాలీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలొ 14 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఎన్నికల ర్యాలీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలొ 14 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

ఈ దారుణ సంఘటన పెషావర్ లో చోటుచేసుకుంది. అవామీ జాతీయ పార్టీ చేపట్టిన ఎన్నికల ర్యాలీనే టార్గెట్ చేసుకుని తీవ్రవాదులు భారీ పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఆత్మాహుతి దాడిలో 14 మంది మృతి చెందగా మరో 51 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ పేలుళ్ల గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. క్లూస్ టీం లను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మృతుల్లో అవామీ జాతీయ పార్టీ అభ్యర్థి హరూన్ బిలోర్ కూడా ఉన్నాడు. హరూన్ తో పాటు ఈ ర్యాలీలో పాల్గొన్న అతడి 16 ఏళ్ల కొడుకు డానియల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడిపై అవామీ పార్టీ జాతీయ నాయకులు విచారం వ్యక్తం చేశారు. 

ఈ ఆత్మాహుతి దాడిపై పాకిస్థాన్ తెహ్రిక్ ఇ  ఇన్సాఫ్ పార్టీ అద్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఈ ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపిన ఆయన, వివిధ పార్టీల నాయకులకు, ర్యాలీలకు ప్రభుత్వం భద్రత అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
 

click me!