థాయ్ గుహ నిర్బంధం: రక్షించాడు, కానీ ఆయన మాత్రం తిరిగిరాని లోకాలకు...

First Published Jul 11, 2018, 10:25 AM IST
Highlights

థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకున్న 12 మంది బాలుర్ని, ఓ కోచ్‌ని సురక్షితంగా బయటకు తీసుకురావంతో యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. కానీ, వారిని రక్షించడానికి వెళ్లిన నేవీ డైవర్ సమన్ గునన్ మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

థాయ్‌లాండ్‌ గుహలో చిక్కుకున్న 12 మంది బాలుర్ని, ఓ కోచ్‌ని సురక్షితంగా బయటకు తీసుకురావంతో యావత్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఈ విషయంలో వివిధ దేశాల నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్స్ చేసిన కృషిని ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి. గుహలో చిక్కున్న వారందరూ సురక్షితంగానే బయటపడ్డారు. కానీ, వారిని రక్షించడానికి వెళ్లిన నేవీ డైవర్ సమన్ గునన్ మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

థాయ్‌లాండ్ గుహ నుంచి బయటకు వచ్చిన పిల్లల గురించి అందరూ మాట్లాండుకుంటున్నారు కానీ, వారిని రక్షించడంలో కీలక పాత్ర పోషించిన డైవర్ సమన్‌ను మాత్రం మర్చిపోతున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో సమన్ గునన్ ధైర్యసాహసాలను మెచ్చుకోవాల్సిందే. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, పిల్లలను క్షేమంగా బయటకు తీసుకురావాలని భావించాడు సమన్. థాయ్ నావికా దళంలో పనిచేసిన 38 ఏళ్ల సమన్‌ గునన్‌ పిల్లలకు ఆహారం, ఆక్సిజన్‌ అందించి తిరిగి వస్తుండగా శ్వాస ఆడక మరణించారు.

జూలై 6వ తేదీన సమన్ మరణించారు. సమన్ మరణవార్త తెలుసుకున్న ఆయన భార్య, సమన్ గురించి చాలా గొప్పగా, గర్వంగా చెప్పారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ సమన్ తన హీరోనే అని, ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో సమన్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. గుహలో చిక్కుకుపోయిన వారికి ఎయిర్ టాంక్స్ అందించడానికి వెళ్లిన సమన్, తిరిగి వస్తున్నప్పుడు తనకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడంతో స్పృహతప్పిపోయారు. తనతో వచ్చిన మరో డైవర్ సమన్‌కు ప్రథమ చికిత్స చేసి, బయటకు తీసుకు వచ్చాడు, వెంటనే సమన్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే సమన్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో సమన్ సేవలు మరువలేనివి. సెల్యూట్ సమన్!

click me!