
ఇస్లామాబాద్ : నైరుతి పాకిస్థాన్‌లో సోమవారం ఓ ఆత్మాహుతి బాంబర్ పోలీసు ట్రక్కును, మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో తొమ్మిది మంది పోలీసులు మృతి చెందారని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు.బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు తూర్పున 160 కి.మీ (100 మైళ్లు) దూరంలో ఉన్న సిబ్బి నగరంలో ఈ దాడి జరిగిందని అధికార ప్రతినిధి మెహమూద్ ఖాన్ నోటిజై రాయిటర్స్‌తో చెప్పారు.
ఈ దాడిలో కనీసం 7 మంది పోలీసులు గాయపడ్డారని, పాకిస్థాన్‌లోని పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో జరుగుతున్న దాడుల కోవలోని దాడే ఇది అని అధికారులు తెలిపారు. బలూచిస్తాన్‌లోని సుసంపన్నమైన గ్యాస్, ఖనిజ వనరులను ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ఆరోపిస్తూ బలూచ్ జాతి గెరిల్లాలు దశాబ్దాలుగా ప్రభుత్వంతో పోరాడుతున్నారు. కాగా, సోమవారం నాటి దాడికి ఏ గ్రూపు బాధ్యత వహించలేదు.
సముద్రం మధ్యలో హనీమూన్ జంటను వదిలేసి వెళ్లిపోయిన స్నొర్కెలింగ్ సంస్థ... రూ.40 కోట్లకు దావా...