తోషాఖానా కేసు: అరెస్టు వారంట్‌తో ఇమ్రాన్ ఇంటికి పోలీసులు, నిరసనలు

Published : Mar 05, 2023, 03:16 PM ISTUpdated : Mar 05, 2023, 03:23 PM IST
తోషాఖానా కేసు: అరెస్టు వారంట్‌తో  ఇమ్రాన్ ఇంటికి  పోలీసులు, నిరసనలు

సారాంశం

పాకిస్తాన్  మాజీ  ప్రధానమంత్రి  ఇమ్రాన్  ఖాన్   ఇంటికి  పోలీసులు  వచ్చారు.  అరెస్ట్  వారంట్ తో  పోలీసులు  రావడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు  సాగుతున్నాయి.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ  ప్రధాన మంత్రి  ఇమ్రాన్ ఖాన్   ఇంటికి  పోలీసులు అరెస్ట్ వారంట్ తో   ఆదివారం నాడు వెళ్లారు.  లాహోర్ లోని  జమాన్ పార్క్  నివాసానికి  ఇమ్రాన్ ఖాన్    పోలీసులు   పెద్ద ఎత్తున వచ్చారు.  

తోషాఖానా కేసులో  కోర్టుకు  హజరు కానందున  మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు  నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది.  ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్  చేసేందుకు  పోలీసులు వచ్చారనే విషయం తెలుసుకున్న ఆ పార్టీ కార్యకర్తలు  పెద్ద ఎత్తున  ఇమ్రాన్ ఖాన్  నివాసానికి చేరుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్  చేయవద్దని  డిమాండ్  చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు  చేశారు.

అంతేకాదు  ఇమ్రాన్  ఖాన్ నివాసం ముందు  నిరసనకు దిగినట్టుగా  జియో న్యూస్ రిపోర్టు  చేసింది.  ఇమ్రాన్ ఖాన్  ను అరెస్ట్  చేస్తారని  ఆ మీడియా  రిపోర్టు  చేసింది.   ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్  చేస్తారనే  ప్రచారంపై  పీటీఐ సీనియర్  వైఎస్ ప్రెసిడెంట్  ఫవాద్  చౌదరి  స్పందించారు.  ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్  చేస్తే  దేశంలో  పరిస్థితి మరింత దిగజారనుందని ఆయన  చెప్పారు.

ఈ కేసులో  గత వారంలో ఇమ్రాన్ ఖాన్  కోర్టుకు  హాజరు కావాల్సి ఉంది.  కొన్ని కారణాలతో  ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు హజరుకాలేదు. దీంతో  అరెస్ట్  వారంట్ ను రద్దు  చేయాలని  కోర్టును ఆశ్రయిస్తామని  ఇమ్రాన్ ఖాన్ లాయర్లు  చెబుతున్నారు. మార్చి  7వ తేదీ లోపుగా ఇమ్రాన్ ఖాన్ ను కోర్టు ముందు హజరుపర్చాలని  అరెస్ట్ వారంట్  చెబుతుందని  జియో న్యూస్  రిపోర్టు  చేసింది.  
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !