మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో బాహ్య జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం - చైనా

By Sairam Indur  |  First Published Jan 11, 2024, 7:53 PM IST

మల్దీవుల (Maldives) అంతర్గత వ్యవహారాల్లో బాహ్య జోక్యాన్ని వ్యతిరేకిస్తామని చైనా (China) స్పష్టం చేసింది. మల్దీవుల అధ్యక్షుడు చైనాలో పర్యటన పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. 


మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో బాహ్య జోక్యాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చైనా తెలిపింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు చైనాలో తన తొలి పర్యటనను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల సార్వభౌమత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని నిలబెట్టడంలో మద్దతుగా ఉంటామని ఆయనకు చైనా హామీ ఇచ్చింది. ఈ మేరకు తమ తమ ప్రధాన ప్రయోజనాలను పరిరక్షించుకోవడంలో ఒకరికొకరు గట్టిగా మద్దతును కొనసాగించడానికి ఇరు పక్షాలు అంగీకరిస్తున్నాయని చైనా నాయకులతో ముయిజు చర్చల ముగింపు సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది.

పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసుంటే బీఆర్ఎస్ గెలిచేది - మాజీ మంత్రి కేటీఆర్

Latest Videos

undefined

మాల్దీవుల జాతీయ సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, జాతీయ గౌరవాన్ని కాపాడుకోవడంలో చైనా గట్టిగా మద్దతు ఇస్తుందని, మాల్దీవుల జాతీయ పరిస్థితులకు తగిన అభివృద్ధి మార్గాన్ని అన్వేషించడాన్ని గౌరవిస్తుందని, మద్దతు ఇస్తుందని, మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తుందని తెలిపింది.

బీఆర్ఎస్ కు వరుస ఎదురు దెబ్బలు.. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం

ప్రపంచంలో ఒకే చైనా ఉందని, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం మొత్తం చైనాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక చట్టబద్ధమైన ప్రభుత్వం అని, తైవాన్ చైనా భూభాగంలో విడదీయరాని భాగమని గుర్తిస్తూ, వన్-చైనా సూత్రానికి కట్టుబడి ఉన్నామని మాల్దీవులు సంయుక్త ప్రకటనలో పేర్కొంది. చైనా సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే ఏ ప్రకటన లేదా చర్యనైనా మాల్దీవులు వ్యతిరేకిస్తుందని తెలిపింది. అలాగే అన్ని "తైవాన్ స్వతంత్ర" వేర్పాటువాద కార్యకలాపాలను వ్యతిరేకిస్తుందని చెప్పింది. తైవాన్ తో ఏ విధమైన అధికారిక సంబంధాలను అభివృద్ధి చేయదని తెలిపింది. 

అయోధ్యకు ఉగ్రదాడి ముప్పు.. భద్రతా సంస్థలు హై అలర్ట్

చైనా అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని మాల్దీవులు వ్యతిరేకిస్తాయని, జాతీయ పునరేకీకరణను సాధించడానికి చైనా చేస్తున్న అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని తెలిపింది. కాగా.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, మల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు మధ్య జరిగిన చర్చల అనంతరం చైనా, మాల్దీవులు బుధవారం 20 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో మల్దీవులకు చైనా పర్యాటకులను పెంచడానికి పర్యాటక రంగంలో సహకారం కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉంది. 

click me!