విమానం డోర్ తెరిచి దూకేసిన ప్రయాణికుడు..

By Sairam Indur  |  First Published Jan 11, 2024, 2:19 PM IST

విమానం డోర్ తెరిచి ఓ ప్రయాణికుడు కిందకు దూకేశాడు (The passenger jumped out of the plane door). దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. విమానం టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న సమయంలో (Ready to Take-Off) ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటన కెనడా (Canada)లో జరిగింది.


కెనడాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ కెనడా కు చెందిన విమానం కెనడా నుంచి దుబాయ్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. ఓ ప్రయాణికుడు విమానం డోర్ తెరిచి కిందకి దూకేశాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సిటీ న్యూస్ టొరంటో కథనం ప్రకారం.. జనవరి 8, సోమవారం సాయంత్రం టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది.

దావత్ ఎంత పని చేసింది.. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి..

Latest Videos

undefined

దీనిపై సమాచారం అందుకున్న వెంటనే ప్రాంతీయ పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రయాణికుడిని హుటా హుటిన హాస్పిటల్ కు తరలించారు. నిందితుడు దుబాయ్‌కి వెళ్లేందుకు ఎయిర్ కెనాడకు చెందిన బోయింగ్ 777 విమానం ఎక్కాడు. కానీ అతడు సీటులో కూర్చోలేదు. టెకాఫ్ కు సిద్ధమవుతుండగా.. డోర్ తెరిచి 20 అడుగుల ఎత్తులో నుంచి దూకేశాడు.

Horrific : An Air Canada Passenger on flight from Toronto to Dubai opens cabin door before departure, plummets to Apron at Toronto Pearson International Airport sustaining injuries !

Air Canada is investigating the shocking mishap. pic.twitter.com/OfGNhtFPy0

— FL360aero (@fl360aero)

ఈ ప్రమాదం కారణంగా 319 మంది ప్రయాణికులతో దుబాయ్‌కి బయలుదేరిన ఎయిర్ కెనడా విమానం దాదాపు 6 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఎదుకంటే అతడు విమానం నుంచి దూకగానే సిబ్బంది కూడా వచ్చి పరిశీలించారు. అతడు బాగానే ఉన్నాడని నిర్ధారించుకున్న తరువాత విమానం గమ్యస్థానానికి వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది. అయితే ఆ ప్రయాణికుడు ఎందుకు అలా చేశాడనేది తెలియలేదు. అరెస్టు చేశారనే లేదా అనే విషయం కూడా ఇంకా అస్పష్టంగా ఉంది.

రాముడి ఉనికినే కాంగ్రెస్ ఖండించింది.. ఆలయం వద్దని కోర్టుకు వెళ్లింది - బీజేపీ

కాగా.. గత వారం కూడా ఎయిర్ కెనడాలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. టొరంటో నుండి కాల్గరీకి వెళ్లే విమానంలో ప్రయాణిస్తున్న ఓ 16 ఏళ్ల బాలుడు కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. దీంతో సిబ్బంది, తోటి ప్రయాణికులు ఆ బాలుడిని అడ్డుకున్నారు. దీంతో ఆ విమానం 3 గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది. ఈ ఘటన తరువాత విమానాన్ని విన్నిపెగ్ వైపు మళ్లించారు. యువకుడిని అక్కడ అరెస్టు చేశారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు.

click me!