రూ.4.5కోట్లు విలువచేసే క్రిప్టో కరెన్సీ... తీవ్రవాద సంస్థ ఖాతాలకు బదిలీ..!

By Ramya news teamFirst Published Jan 24, 2022, 12:43 PM IST
Highlights

  ఈ వాలెట్లను ఇప్పటికే ఇజ్రాయిల్ నేషనల్ బ్యూరో కౌంటర్ టెర్రర్ ఫైనాన్సింగ్ స్వాధీనం చేసుకుందని అధికారులు తెలిపారు.

క్రిప్టో కరెన్సీ నయా దందా ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్, స్ట్రాటజిక్  అధికారుల ఆపరేషన్ వింగ్ లో.. ఈ దందా గురించి బయటపడింది. 30.85లక్షల క్రిప్టో కరెన్సీని  గతంలో విదేశీ సంస్థలకు ట్రాన్స్ఫర్ చేశారట. కాగా.. ప్రస్తుతం ఆ క్రి ప్టో కరెన్సీ విలువ దాదాపు రూ.4.5కోట్లు ఉందని అధికారులు చెప్పారు. ఈ కరెన్సీని మూడు విదేశీ సంస్థలకు బదిలీ చేశారట. దానిలో.. ఒకటి పాలస్తీనా తీవ్రవాద సంస్థ కూడా ఉండటం గమనార్హం.


దాదాపు ఐదు నెలల విచారణలో ఈ విషయం వెలల్డైంది.  ఢిల్లీ పోలీసులు ఈ క్రిప్టో కరెన్సీ జాడ కనుగొన్నారు. ఈ కరెన్సీ మొత్తం హమాస్ అల్- కస్సామ్ బ్రిగేట్స్ వాలెట్లకు దారితీసిందని వారు పేర్కొన్నారు.  ఈ వాలెట్లను ఇప్పటికే ఇజ్రాయిల్ నేషనల్ బ్యూరో కౌంటర్ టెర్రర్ ఫైనాన్సింగ్ స్వాధీనం చేసుకుందని అధికారులు తెలిపారు.

2019లో ఢిల్లీలోని వ్యాపారవేత్త నుంచి రూ.30.85లక్షల విలువైన క్రిప్టోకరెన్సీలు దొంగతనం చేశారు. సదరు వ్యాపారి తన వాలెట్లను యాక్సెస్ చేయడంలో విఫలమైన తర్వాత.. పశ్చిమ్ విహార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. స్థానిక కోర్టు ఆదేశాల తర్వాత.. దర్యాప్తు సైబర్ క్రైమ్ యూనిట్, ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెలకు బదిలీ  చేశారు.

"సంఘటన సమయంలో అతని క్రిప్టోకరెన్సీ వాలెట్ నుండి రూ. 30,85,845 విలువైన చోరీకి గురైనట్లు ఫిర్యాదు నమోదైందని" అని ఐఎఫ్‌ఎస్‌ఓ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కెపిఎస్ మల్హోత్రా తెలిపారు. "ఖాతాకు బదిలీ చేయబడిన క్రిప్టోకరెన్సీలు మహ్మద్ నసీర్ ఇబ్రహీం అబ్దుల్లాకు చెందినవి" అని ఢిల్లీ పోలీసు అధికారి తెలిపారు.

డిజిటల్ కరెన్సీలను బదిలీ చేసిన ఇతర వాలెట్లు ఈజిప్ట్‌లోని గిజా, పాలస్తీనాలోని రమల్లా నుండి ఆపరేట్ చేయబడినట్లు కనుగొన్నారు. డిజిటల్ కరెన్సీలు వివిధ ప్రైవేట్ వాలెట్ల ద్వారా తీవ్రవాద సంస్థ వాలెట్ కి  చేరినట్లు అధికారులు చెబుతున్నారు. 

click me!