
జకార్తా : సరదాగా తీసుకున్న సెల్ఫీలు అతన్ని కోటీశ్వరుడిని చేశాయి. అతన్ని అనుకోకుండా అదృష్టం వరించింది. ఐదేళ్లు పాటు రోజుకో సెల్ఫీ తీసుకున్న అతడు ఇప్పుడు social mediaలో హాట్ టాపిక్ గా మారాడు. ఇంతకీ ఎవరతనూ అంటే.. జకార్తాలోని ఓ Computer science student...
మమూలుగా selfies ఎప్పుడు తీసుకుంటాం..? ఫ్రెండ్స్ తో కలిసినప్పుడో.. చక్కగా రెడీ అయినప్పుడో.. ఏదైనా చారిత్రక ప్రదేశానికి వెళ్లినప్పుడు, విహారానికో, విందులకో.. బంధువులతోనో, స్నేహితులతోనో గడిపినప్పుడో.. అలా ప్రత్యేకమైన సందర్బాల్లో సెల్ఫీలు తీసుకుంటాం. అయితే ఈ Indonesian student మాత్రం క్రమం తప్పకుండా తన కంప్యూటర్ ముందు కూర్చోగానే ఓ సెల్ఫీ తీసుకునేవాడట. అది ఎలా వస్తుందనే దానితో సంబంధం లేకుండా.. అదో యజ్నంలా.. అనుకోకుండానే ఐదేళ్లపాటు కొనసాగించాడట.
రోజు సెల్ఫీ తీసుకునే ఈ అలవాటే ఇప్పుడు ఆ విద్యార్థి జీవితాన్ని మార్చేశాయి. అంతర్జాతీయంగా గుర్తింపుతోపాటు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టాయి. Sultan Gustaf Ali Ghozali (22) ఇండోనేషియాలోని సెమరాంగ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి. కంప్యూటర్ ముందు కూర్చుని రోజు ఒక సెల్ఫీ తీసుకుంటాడు. అలా ఐదేళ్లుగా చేస్తున్నాడు.
గ్రాడ్యుయేషన్ సమయంలో తనలో వచ్చిన మార్పుల్ని తెలిపేలా సెల్ఫీలు అన్నిటి తో కలిపి ఓ టైం ల్యాప్స్ వీడియో చేద్దామనుకున్నాడు. ఇంతలోనే ‘Non-fungible token’లకు సంబంధించిన వార్తలు అతని దృష్టిని ఆకర్షించాయి. వెంటనే సంబంధిత వెబ్సైట్లో ఖాతా తెరిచాడు. జనవరి 10న ‘Ghojali Everyday’ పేరుతో 933 సెల్ఫీలు అమ్మకానికి పెట్టాడు. ఒక్కో దాని ధర మూడు డాలర్లు అని పోస్ట్ పెట్టాడు.
ఒక్కరి పోస్టు వల్ల…
ఘొజాలి సెల్ఫీ నీ ఎన్ఎఫ్ టీగా కొన్నట్లు ఓ సెలబ్రిటీ షెఫ్ ట్వీట్ చేశారు. అంతే అతడి సెల్ఫీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. జనవరి 21 కల్లా.. ఐదు వందల మందికి పైగా ఈ సెల్ఫీలు కొనుగోలు చేశారు. ఫలితంగా అతని ఖాతాలో 384 ఎథెర్ కాయిన్స్ వచ్చి చేరాయి. ఎథెర్ అంటే బిట్ కాయిన్ తరహా క్రిప్టో కరెన్సీ. 384 ఎథెర్ ల విలువ.. పది లక్షల డాలర్లకు పైగానే. అంటే దాదాపు 7.5 కోట్ల రూపాయలు. ట్వీట్లు, పాటలు, వీడియోలు, ఫోటోలను డిజిటర్ రూపంలో అమ్మేందుకు, కొనేందుకు వినియోగిస్తున్న టెక్నాలజీనే ఎన్ఎఫ్టీ.