శ్రీలంక పార్లమెంట్ రద్దు: విశ్వాస పరీక్షలో ఓడిపోయిన రాజపక్సే

By sivanagaprasad kodatiFirst Published Nov 14, 2018, 12:34 PM IST
Highlights

రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయాలు రోజుకోక మలుపు తిరుగుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధానిగా నియమించిన మహింద్రా రాజపక్సే విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. 

రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయాలు రోజుకోక మలుపు తిరుగుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధానిగా నియమించిన మహింద్రా రాజపక్సే విశ్వాస పరీక్షలో ఓడిపోయారు.

పార్లమెంటును రద్దు చేస్తూ ఈ నెల 9న దేశాధ్యక్షుడు సిరిసేన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆయన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం..అధ్యక్షుని నిర్ణయంపై స్టే విధించింది.

అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరి 5న ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను సైతం నిలిపివేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్లమెంటు యథావిధిగా కొనసాగుతుంది.. దీని ప్రకారం స్పీకర్ జయసూర్య బుధవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా రాజపక్సేకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ బలపరీక్షలో మెజార్టీ సభ్యులు రాజపక్సేకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆయన ఓడిపోయినట్లు స్పీకర్ ప్రకటించారు. 
 

శ్రీలంకలో ముదిరిన సంక్షోభం.. పార్లమెంట్‌‌ను రద్దు చేసిన అధ్యక్షుడు

కాల్పుల కేసులో శ్రీలంక మాజీ కెప్టెన్ అరెస్ట్...

ఇండియన్ సీక్రెట్ ఏజెన్సీ ‘రా’ నన్ను చంపాలనుకుంటోంది : శ్రీలంక అధ్యక్షుడు

click me!