కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 31కి చేరిన మృతుల సంఖ్య

Published : Nov 12, 2018, 02:53 PM IST
కాలిఫోర్నియాలో కార్చిచ్చు.. 31కి చేరిన మృతుల సంఖ్య

సారాంశం

అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో మొదలైన కార్చిచ్చు.. ఇంకా వ్యాపిస్తూనే ఉంది. 

అమెరికాలోని కాలిఫోర్నియా అడవుల్లో మొదలైన కార్చిచ్చు.. ఇంకా వ్యాపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఈ కార్చిచ్చు కారణంగా  31మంది మృతిచెందగా.. సుమారు 200మంది అదృశ్యమయ్యారు, 2లక్షల 50వేల మంది తమ నివాసాలను వదిలి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.

ఈ కార్చిచ్చు కారణంగా వేలాది ఏకరాల అడవి బూడిదపాలు కాగా.. ప్యారడైజ్ పట్టణమంతా నల్లటి పొగతో కుమ్ముకున్నది. ఆ ప్రాంతంలో విద్యుత్ లైన్లు కూడా దెబ్బతిన్నాయి. ఈ మంటలకు తోడు బలమైన గాలులు కూడా తోడు కావడంతో మంటలు మరింత ఎక్కువ అవుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు.

మంటలను పూర్తిగా ఆపడానికి కనీసం మరో మూడు వారాలైనా పడుతుందని అక్కడి అధికారులు అంచనావేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే