
రోజు రోజుకు శ్రీలంక ఆర్థిక పరిస్థితి మరింత సంక్షోభంలో పడిపోతోంది. ఆ దేశ అవసరాలకు ఉపయోగపడే పెట్రోల్ కొనేందుకు కూడా డబ్బులు లభించడం లేదు. పెట్రోల్ ట్యాంకులతో నిండి ఉన్న ఓ షిప్ ఆ దేశ సముద్ర జలాల్లో నిలబడి ఉన్నప్పటికీ, దానిని కొనుగోలు చేసేందుకు ఆ దేశానికి శక్తి సరిపోవడం లేదు. ఈ విషయాన్ని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. పెట్రోలు నింపిన ఓడ దాదాపు రెండు నెలలుగా ఒడ్డున నిలిపి ఉంచిందని, అయితే దానికి చెల్లించడానికి తమ వద్ద విదేశీ కరెన్సీ లేదని శ్రీలంక బుధవారం తెలిపింది.
ఈ ఇంధనం కోసం క్యూలలో నిలబడి వేచి ఉండవద్దని శ్రీలంక తన పౌరులకు విజ్ఞప్తి చేసింది. అయితే శ్రీలంక ప్రభుత్వం తమ దేశంలో తగినంత డీజిల్ నిల్వలు ఉన్నాయని తెలిపింది. మార్చి 28 నుంచి పెట్రోలు నింపిన నౌక శ్రీలంక జలాల్లో లంగరు వేసిందని విద్యుత్, ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర పార్లమెంట్‌కు తెలిపారు. దేశంలో పెట్రోల్ లభ్యత సమస్య ఉందని ఆయన ధృవీకరించారు.
అమెరికాలో ఈ ఏడాది తొలి మంకీ పాక్స్ కేసు.. కెనడా వెళ్లివచ్చిన వ్యక్తికి నిర్దారణ.. లక్షణాలు ఇవే..
‘‘ పెట్రోలు నింపిన ఓడ కోసం చెల్లించడానికి మా వద్ద US డాలర్లు లేవు’’ ఆయన ప్రకటించారు. అదే నౌకలో నుంచి 2022 జనవరిలో కొనుగోలు చేసిన పెట్రోల్ కు సంబంధించిన 53 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉందని ఆయన అన్నారు. రెండు చెల్లింపులు సెటిల్ అయ్యే వరకు ఓడను విడుదల చేసేందుకు సంబంధిత షిప్పింగ్ కంపెనీ నిరాకరించిందని మంత్రి తెలిపారు.
అందుకే ఇంధనం కోసం లైన్‌లో వేచి ఉండవద్దని ప్రజలను అభ్యర్థించామని మంత్రి చెప్పారు. ‘‘డీజిల్‌తో సమస్య లేదు. కానీ దయచేసి పెట్రోల్ కోసం లైన్‌లో నిలబడకండి. మనకు పరిమితమైన పెట్రోల్ స్టాక్ ఉంది. దానిని అవసరమైన సేవలకు అంటే ముఖ్యంగా అంబులెన్స్‌లకు పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అన్ని ఫిల్లింగ్ స్టేషన్లలో పెట్రోలు పంపిణీ పూర్తి కావడానికి శుక్రవారం తరువాత మరో మూడు రోజులు పడుతుంది ’’ అని చెప్పారు.
2022 జూన్ నాటికి ఇంధన దిగుమతుల కోసం శ్రీలంకకు 530 మిలియన్ డాలర్లు అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ఇండియా క్రెడిట్ ఫెసిలిటీ ప్రయోజనాన్ని దేశం పొందినప్పటికీ.. ఇంధన కొనుగోళ్లకు 500 మిలియన్లకు పైగా డాలర్లు అవసరం అవుతుందని అన్నారు. చివరి ఇంధన దిగుమతి సరుకు కోసం శ్రీలంక 700 మిలియన్లకు పైగా చెల్లించవలసి ఉందని ఆయన చెప్పారు.
India-China border dispute: రెచ్చిపోతున్న డ్రాగన్ కంట్రీ.. పాంగోంగ్ సరస్సుపై బ్రిడ్జి నిర్మాణం..
ఈ ద్వీప దేశం దాని స్వతంత్ర చరిత్రలో అత్యంత అధ్వాన్నమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆహార పదర్థాల నుంచి వంట గ్యాస్ వరకు ప్రతి దానికీ కొరత ఉంది. దీంతో ఆసియాలో అత్యంత వేగవంతమైన ద్రవ్యోల్బణం ఏర్పడింది. ఈ దేశంలో ధరలు దాదాపు 30 శాతం పెరిగాయి. ఇవి సామాజిక అశాంతి, రాజకీయ గందరగోళానికి దారితీశాయి.
దేశ వ్యాప్తంగా ఎన్నో నిరసనల తరువాత ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే పదవి చేపట్టారు. అయితే బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కాకముందే దేశంలో ఒక రోజుకు సరిపడా గ్యాసోలిన్ స్టాక్ మాత్రమే ఉందని చెప్పారు. ముడి చమురు, ఫర్నేస్‌తో కూడిన మూడు నౌకలకు చెల్లించడానికి బహిరంగ మార్కెట్‌లో డాలర్లను పొందేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గత సోమవారం చెప్పారు.