కనిపించకుండా పోయిన నలభైయేళ్లకు మంచు కొండల్లో.. అస్థిపంజరంగా... జర్మన్ స్కీయర్ మరణ రహస్యం...

Published : Nov 06, 2021, 12:37 PM IST
కనిపించకుండా పోయిన నలభైయేళ్లకు మంచు కొండల్లో.. అస్థిపంజరంగా... జర్మన్ స్కీయర్ మరణ రహస్యం...

సారాంశం

కనిపించకుండా పోయిన సమయంలో రూడీ మోడర్ వయసు 27 సంవత్సరాలు. ఫిబ్రవరి 13, 1983న కొలరాడోలోని మంచుతో నిండి ఉన్న రాకీ పర్వతాలలో స్కీయింగ్ కు వెళ్లాడు. ఆ పర్వతాల్లోని బాగా మంచుతో కప్పబడిన మార్గం గుండా Skier బయలుదేరాడు.

లాస్ ఏంజిల్స్ : నాలుగు దశాబ్దాల నెవర్ సమ్మర్ పర్వతాలలో అదృశ్యమైన జర్మన్ స్కీయర్ కేసు మిస్టరీ పరిష్కరించబడింది. పర్వతాల్లో స్కీయర్ అస్థిపంజర అవశేషాలను కనుగొనడంతో ఈ కేసు పరిష్కరించబడినట్లేనని యుఎస్ అధికారులు ఈ వారం తెలిపారు.

కనిపించకుండా పోయిన సమయంలో రూడీ మోడర్ వయసు 27 సంవత్సరాలు. ఫిబ్రవరి 13, 1983న కొలరాడోలోని మంచుతో నిండి ఉన్న రాకీ పర్వతాలలో స్కీయింగ్ కు వెళ్లాడు. ఆ పర్వతాల్లోని బాగా మంచుతో కప్పబడిన మార్గం గుండా Skier బయలుదేరాడు. మామూలుగా అయితే స్కీయింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుని అతను తిరిగి వస్తాడు. కానీ ఈ సారి మాత్రం వెళ్లిన తరువాత అతను తిరిగి రాలేదు.

Rudi Moder రూమ్మేట్ కు మోడర్ గురించి బాగా తెలుసు. ఎప్పుడు వెళ్లినా రెండు, మూడు రోజుల్లో తిరిగి వస్తాడు. కానీ ఈ సారి వెళ్లిన వారానికి కూడా ఇంకా తిరిగి రాకపోవడంతో రూడీ రూమ్మేట్ కంగారు పడ్డాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో high-altitude search కు ఆదేశాలు జారీ చేశారు. స్నిఫర్ డాగ్‌లు, స్కిస్, స్నో షూస్‌లతో రెస్క్యూవర్స్, ఎరియల్ నిఘా ద్వారా వెతుకులాట ప్రారంభించారు.

అయితే భారీ మంచు, చలి వాతావరణం వారిని నాలుగు రోజుల కంటే ముందుకు ఆపరేషన్ కొనసాగించనివ్వలేదు. నాలుగు రోజుల్లోనే భారీ మంచు కారణంగా వెతికే జట్లకు ఆటంకం ఏర్పడింది, అయితే వీరు కొన్ని చోట్ల ఆహార నిల్వలను, సమీపంలోని మోడర్ స్లీపింగ్ బ్యాగ్ ను, ఇతర గేర్‌లు ఉన్న మంచు గుహను స్వాధీనం చేసుకున్నారు.

ఆ తర్వాత, ఈ trail ఇక ముందుకు సాగలేదు. తరువాతి నెలలు, సంవత్సరాలలో చేసిన తదుపరి శోధనల్లో ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఆ తర్వాత గత ఏడాది ఆగస్టులో, 11,000 అడుగుల (3,350 మీటర్లు) ఎత్తులో హిమపాతం శిధిలాల సమీపంలో స్కెలిటన్ గల్చ్ ప్రాంతంలో ఒక హైకర్ ద్వారా మానవ ఎముకలు కనుగొనబడ్డాయని నేషనల్ పార్క్ సర్వీస్ గురువారం తెలిపింది.

మాజీ భర్తమీది కోపం.. ఐదుగురు పిల్లలకు మత్తుమందిచ్చి చంపిన కన్నతల్లికి...జీవితఖైదు

"ఈ వేసవిలో, పార్క్ రేంజర్లు ఆ ప్రాంతాన్ని మరింత శోధించారు. ఆ ఎముకలు మోడర్‌కు చెందినవిగా భావించారు. దీనికోసం అతని వ్యక్తిగత వస్తువులతో పాటు స్కిస్, పోల్స్,  బూట్‌లు కూడా కనుగొన్నారు" అని ఒక ప్రకటన తెలిపింది.

అవశేషాలను సేకరించడంలో, భద్రపరచడంలో సహాయం కోసం  FBI ఎవిడెన్స్ రెస్పాన్స్ టీమ్ ను పిలిచారు. అయితే నోట్లోని పండ్ల రికార్డుల ఆధారంగా అస్థిపంజర అవశేషాలను సానుకూలంగా గుర్తించడానికి కరోనర్ చేసిన ప్రయత్నాలు అసంపూర్తిగా ఉన్నాయని పార్క్ సర్వీస్ తెలిపింది.

అయినప్పటికీ, జర్మన్ ప్రభుత్వానికి, మోడర్ కుటుంబంతో మంచి సహకారం ఉంది. దీంతో అధికారులు ఈ రహస్యాన్ని ఛేదించినట్లు విశ్వసిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !