గంజాయి తరలించాడని భారత సంతతి వ్యక్తిని ఉరితీసిన సింగపూర్.. యూఎన్ వో విజ్ఞప్తి చేసినా పట్టించుకోని ప్రభుత్వం..

By Asianet NewsFirst Published Apr 26, 2023, 11:24 AM IST
Highlights

గంజాయి స్మగ్లింగ్ చేసే వారి పట్ల సింగపూర్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. గంజాయి తరలింపు కేసులో 2017లో దోషిగా తేలిన భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తికి మంగళవారం ఉరి శిక్షను అమలు చేసింది. దీనిని రద్దు చేయాలని అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి వచ్చినా.. సింగపూర్ వెనక్కి తగ్గలేదు.

ఒక కిలో గంజాయి స్మగ్లింగ్ కు కుట్ర పన్నాడని భారత సంతతికి చెందిన వ్యక్తిని సింగపూర్ బుధవారం ఉరితీసింది. మరణశిక్షను రద్దు చేయాలన్న అంతర్జాతీయ డిమాండ్లు వచ్చిన అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉరితీతపై తక్షణమే పునరాలోచించాలని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కార్యాలయం సింగపూర్ కు విజ్ఞప్తి చేసింది. అలాగే బ్రిటీష్ టైకూన్ రిచర్డ్ బ్రాన్సన్ కూడా ఈ ఉరిశిక్షను నిలిపివేయాలని పిలుపునిచ్చినా అధికారులు వెనక్కితగ్గలేదు. సింగపూర్ లో భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య(46)కు చాంగి ప్రిజన్ కాంప్లెక్స్ లో ఉరిశిక్ష అమలు చేసినట్లు సింగపూర్ ప్రిజన్స్ సర్వీస్ అధికార ప్రతినిధి ప్రకటించారు.

40 మంది మహిళలకు ఒక్కడే భర్త.. వారి పిల్లలకు తండ్రి కూడా అతడే.. రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి షాకైన ఆఫీసర్లు..

Latest Videos

భారత సంతతికి చెందిన తంగరాజు సుప్పయ్య  1,017.9 గ్రాముల (35.9 ఔన్సులు) గంజాయిని రవాణా చేయడానికి కుట్ర పన్నినందుకు 2017లో దోషిగా తేలాడు. 2018లో అతడికి మరణశిక్ష విధించగా.. అప్పీల్ కోర్టు ఈ తీర్పును సమర్థించింది. కాగా.. జెనీవాకు చెందిన గ్లోబల్ కమిషన్ ఆన్ డ్రగ్ పాలసీ సభ్యుడు బ్రాన్సన్ సోమవారం తన బ్లాగ్ లో.. తంగరాజును అరెస్టు చేసిన సమయంలో ఆయన దగ్గర డ్రగ్స్ లేదని, సింగపూర్ ఓ అమాయకుడిని చంపబోతోందని పేర్కొన్నారు.

భారత్ పై జర్మనీ అక్కసు.. జనాభా పెరుగుదలను చూపిస్తూ వ్యంగ్యంగా కార్టూన్.. మండిపడుతున్న నెటిజన్లు

తంగరాజు శిక్ష విషయంలో అంతర్జాతీయంగా విజ్ఞప్తులు, డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో సింగపూర్ హోం మంత్రిత్వ శాఖ మంగళవారం స్పందించింది. తంగరాజు నేరం చేశాడని, అది నిస్సందేహంగా రుజువైందని పేర్కొంది. డ్రగ్స్ డెలివరీని కమ్యూనికేట్ చేసేందుకు అతడు రెండు మొబైల్ ఫోన్లు ఉపయోగించినట్లు తెలిపింది. మరణశిక్ష పడిన సింగపూర్ పౌరుడిపై బ్రాన్సన్ అభిప్రాయాలు తమ దేశ న్యాయమూర్తులను, క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను అగౌరవపరిచాయని పేర్కొంది. తంగరాజు తరఫున మాట్లాడుతున్న బ్రాన్సన్, ఈ కేసును మూడు సంవత్సరాలకు పైగా క్షుణ్ణంగా, సమగ్రంగా పరిశీలించిన సింగపూర్ కోర్టుల కంటే ఎక్కువ తెలుసనుకోవడం శోఛనీయమని తెలిపింది.

పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ మరణం.. 2 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మాదకద్రవ్యాల నిరోధక చట్టాలు సింగపూర్ లో అమలులో ఉన్నాయి. వీటి అక్రమ రవాణాకు మరణశిక్ష సమర్థవంతమైన నిరోధకమని ఆ దేశం భావిస్తోంది. అయితే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు.

నేడే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు..

మరణ శిక్షనేరాలను నియంత్రిస్తుందని అనుకోవడం అపోహే అవుతుందని అనేక దేశాలు భావిస్తున్నాయని యూఎన్ వో మానవ హక్కుల విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అందుకే చాలా తక్కువ దేశాల్లో మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారని పేర్కొంది. కాగా.. రెండేళ్ల విరామం తర్వాత 2022 మార్చిలో సింగపూర్ ఉరిశిక్షలను పునఃప్రారంభించింది.

click me!