అమెరికాలో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి...

By SumaBala BukkaFirst Published Apr 19, 2023, 3:18 PM IST
Highlights

మైనేలోని ఒక ఇంటిలో నలుగురు వ్యక్తులు కాల్చి చంపబడ్డారు. అంతకు ముందు రద్దీగా ఉండే హైవేపై మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.

అమెరికా : మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం యూఎస్ లోని మైనేలో ఒక ఇంటిలో నలుగురు వ్యక్తులను ఘోరంగా కాల్చి చంపారు. నలుగురిని కాల్చి చంపేముందు..  రద్దీగా ఉండే హైవేపై తుపాకీ కాల్పులకు ముగ్గురు గాయపడ్డారు. ఇది ఒక నేరం కాదని మిగతా నేరాలతో ముడిపడి ఉన్నాయని అధికారులు తెలిపారు. కొన్ని గంటల తర్వాత, ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిపై హత్యా నేరం మోపబడింది.

కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు అంతర్రాష్ట్ర రహదారిలో కొంత భాగాన్ని మూసివేశారు. సాధారణ ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని అధికారులు నిర్ధారించడానికి ముందు ఆ ప్రాంతంలోని నివాసితులు,వ్యాపారులను గంటన్నరపాటు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆదేశించారు.

చైనాను దాటేసింది.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్.. జనాభా ఎంతంటే..

టేనస్సీలోని నాష్‌విల్లేలోని క్రిస్టియన్ ప్రాథమిక పాఠశాలతో సహా పెద్ద, చిన్న కమ్యూనిటీల్లో ఇలాంటి సామూహిక హత్యలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కెంటుకీలోని లూయిస్‌విల్లేలోని ఒక బ్యాంకు, అలబామాలోని ఒక చిన్న నగరంలో స్వీట్ 16 పార్టీలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

మైనేలో, బోడోయిన్‌కు చెందిన జోసెఫ్ ఈటన్ (34)పై పోలీసులు మంగళవారం సాయంత్రం నాలుగు హత్యల నేరాన్ని మోపారు. అయితే కాల్పులకు గల కారణాలను చర్చించడానికి లేదా కాల్పుల బాధితులను గుర్తించడానికి నిరాకరించారు. ఈటన్ ఈ వారంలో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. నేరాలు గ్రామీణ బౌడోయిన్‌లో ప్రారంభమయ్యాయి. అక్కడ మృతదేహాలు కనుగొనబడ్డాయి. యర్‌మౌత్‌లోని ఇంటర్‌స్టేట్ 295లో దక్షిణాన 25 మైళ్ళు (40 కిలోమీటర్లు) కాల్పులతో కొనసాగాయి. పోలీసులు తెలిపారు. ముగ్గురు హైవే బాధితుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

click me!