సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ఒకటి ఓ మహిళకు పలు సంస్థల నుండి ఇంటర్వ్యూల కోసం సమాచారం వచ్చింది.
వాషింగ్టన్: సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో ఓ యువతికి వందలాది సంస్థల నుండి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆఫర్లు వచ్చాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:ఒక్క ఎంపీ స్థానం ఇవ్వండి: తెలంగాణ కాంగ్రెస్‌ను కోరిన సీపీఐ
undefined
మార్టా ప్యూర్టో అనే మహిళ తాను చేస్తున్న ఉద్యోగాన్ని కోల్పోయారు. అయితే ఉద్యోగం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దరిమిలా ఒక్క నిమిషం 42 సెకన్ల వీడియోను ఆమె లింక్డ్ ఇన్ లో పోస్టు చేశారు.ఈ వీడియో పోస్టు చేసిన తర్వాత ఆమె దశ తిరిగింది. ఈ వీడియో చూసిన వందలాది సంస్థలు ఆమెకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సమాచారం పంపారు.
ఉద్యోగం కోసం రెజ్యూమ్ ను ఆయా సంస్థలకు పంపుతాం. అయితే తనకు ఉన్న అర్హతలను ప్రమోట్ చేసుకొనే ఉద్దేశ్యంతో 1:42 నిమిషాల వీడియోను ఆమె లింక్డ్‌లో పోస్టు చేశారు.
also read:భవిష్యత్తుపై భరోసా: పార్లమెంట్ ఎన్నికలకు శ్రేణులను సిద్దం చేస్తున్న కేసీఆర్
ఈ వీడియో పోస్టు చేసిన వెంటనే 60 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేకాదు ఈ వీడియో వైరల్ గా మారింది. వందలాది మందిని ఈ వీడియో ఆకర్షించింది. పలు సంస్థలు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆమెకు సమాచారం పంపారు.
also read:యజమానిని చూసి గంతులేసిన కుక్క: సోషల్ మీడియాలో వైరలైన వీడియో
తాను పోస్టు చేసిన వీడియోకు 100 లేదా 200 లైక్ లు వస్తాయని భావించినట్టుగా చెప్పారు. తనకు ఉన్న అర్హతలను స్పష్టంగా ఆ వీడియోలో చెప్పినట్టుగా ఆమె తెలిపారు. ప్రపంచంలోని పలు దేశాల్లో చోటు చేసుకున్న ఆర్ధిక మాంధ్యం నేపథ్యంలో పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ తరుణంలో ఉద్యోగాలను కాపాడుకోవడం ఉద్యోగులకు కత్తిమీద సామే. ఉద్యోగాలు కోల్పోయిన వందలాది మంది జాబ్స్ కోసం పోటీ పడడం వల్ల కూడ చాలా మంది ఉద్యోగాలను దక్కించుకోవడానికి వేచి చూడాల్సి వస్తుంది.
మరోవైపు టెక్నాలజీ కూడ ఉద్యోగాల కోతకు కారణమౌతుంది. పలు సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఫ్యూర్టో ఫిన్ టెక్ కంపెనీలో గత ఏడాది అక్టోబర్ మాసంలో ఉద్యోగాన్ని కోల్పోయింది.అప్పటి నుండి ఆమె ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ, ఆమెకు ఆశించిన ఫలితం దక్కలేదు.
ఇంటర్వ్యూ వరకు తాను వెళ్లడం కొరకు ఏం చేయాలనే దానిపై ఆలోచించి తన అర్హతలు, అనుభవాలపై వీడియోను తయారు చేసి లింక్డ్ ఇన్ లో పోస్టు చేసినట్టుగా ఫ్యూర్టో చెప్పారు.