గుడ్ న్యూస్: కరోనాకి ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్.. నేడు అందుబాటులోకి...

By telugu news teamFirst Published Jul 16, 2020, 10:46 AM IST
Highlights

ఇప్పటికే రెండు దశల్లో వ్యాక్సిన్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన ఆక్స్ ఫర్డ్, మూడవ దశ పరీక్షలను గత నెలలో బ్రెజిల్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ ఇప్పటికే లక్షల మందికి సోకగా.. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.  ఎటునుంచి ఎవరికి ఈ వైరస్ సోకుతుందో కూడా అర్థం కావడం లేదు. దీంతో.. అందరూ వైరస్ పేరు చెబితేనే భయపడిపోతున్నారు. కాగా... ఈ వైరస్ వ్యాక్సిన్ కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే... ఈ విషయంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఓ అడుగు ముందుకేసింది.

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా తో కలిసి కోవిడ్ 19కి వ్యాక్సిన్ తయారు చేశారు. కాగా... ఈ వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా... ఈ వ్యాక్సిన్ విషయంలో ఆక్స్ ఫర్డ్ ప్రపంచ దేశాలకు శుభవార్త తెలియజేసింది.

ఇప్పటికే రెండు దశల్లో వ్యాక్సిన్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన ఆక్స్ ఫర్డ్, మూడవ దశ పరీక్షలను గత నెలలో బ్రెజిల్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

బ్రెజిల్ లో వేలాది మందిపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగించగా, విజయవంతం అయినట్టు తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని, ఈ వార్త దాదాపుగా గురువారం నాడు బయటకు వస్తుందని ఐటీవీ పొలిటికల్ ఎడిటర్ రాబర్ట్ పెస్టన్, తన బ్లాగ్ లో వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ వాడిన వారిలో యాంటీ బాడీలు, టీ-సెల్ (కరోనా వైరస్ కిల్లర్ సెల్) లను జనరేట్ చేసిందని, ఈ వ్యాక్సిన్ ప్రభావవంతమైనదేనని ఆక్స్ ఫర్డ్ నిరూపిస్తే, సెప్టెంబర్ నుంచి భారీ ఎత్తున తయారీ జరుగుతుందని ఆయన అన్నారు. 

కాగా, రాబర్డ్ పెస్టన్ తన బ్లాగ్ లో ఈ విషయాన్ని వెల్లడించగానే, లండన్ స్టాక్ మార్కెట్లో ఆస్ట్రా జెనికా ఈక్విటీ విలువ 5 శాతం లాభపడింది. ఇదిలావుండగా, కరోనాపై బ్రిటన్, చైనా, ఇండియా, యూఎస్ తదితర దేశాల్లో సుమారు 12కు పైగా రకాల వ్యాక్సిన్ లు వివిధ దశల్లో పరీక్షించబడుతున్న సంగతి తెలిసిందే.

click me!