బుర్ఖా తీసి కర్రకు కట్టినందుకు.. 20 ఏళ్ల జైలు శిక్ష

First Published Jul 10, 2018, 6:39 PM IST
Highlights

బుర్ఖా తీసేసినందుకు ఓ మహిళకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఇరాన్.. ఆ దేశంలో 1979 నుంచి ఇస్లామిక్ డ్రెస్ కోడ్ అమల్లో ఉంది.. దీని ప్రకారం.. 13 ఏళ్లు పైబడిన మహిళలంతా తప్పనిసరిగా బుర్ఖా ధరించాల్సిందే

ఇస్లాం దేశాల్లో మహిళలు బుర్ఖా లేకుండా బహిరంగంగా తిరగరాదన్నది నిబంధన.. దీనిని మీరితే ఆయా దేశాల్లో వేసే శిక్షలు కూడా దారుణంగా ఉంటాయి. తాజాగా బుర్ఖా తీసేసినందుకు ఓ మహిళకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఇరాన్.. ఆ దేశంలో 1979 నుంచి ఇస్లామిక్ డ్రెస్ కోడ్ అమల్లో ఉంది.. దీని ప్రకారం.. 13 ఏళ్లు పైబడిన మహిళలంతా తప్పనిసరిగా బుర్ఖా ధరించాల్సిందే. దీనిని ఉల్లంఘించిన వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తారు.

కాగా..  షపార్క్ షజారి జదేహ్ అనే మహిళ ముస్లిం మహిళలు తప్పనిసరిగా హెడ్‌స్క్రాఫ్‌(బుర్ఖాను) నిబంధనను వ్యతిరేకిస్తూ.. తాను ధరించిన హెడ్ స్క్రాఫ్‌ను తీసి కర్రకు కట్టి రాజధాని టెహ్రాన్ వీధుల్లో శాంతి జెండాలా రెపరెపలాడించారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

దేశ చట్టాలను ఉల్లంఘించినందుకు గానూ ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అక్కడితో ఆగకుండా షపార్క్‌పై అవినీతి, వ్యభిచారం వంటి కేసులు నమోదు  చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెను అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై బయటకు వచ్చిన ఆమె తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా తనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు..కేసుల గురించి వెల్లడించారు.. తనతో పాటుగా 29 మంది మహిళలను హెడ్‌స్క్రాఫ్ తొలగించని కారణాన్ని చూపి అరెస్ట్ చేశారని తెలిపారు.
 

click me!