మైక్రోసాఫ్ట్ లోకి ఓపెన్ ఏఐ మాజీ సీఈవో సామ్ ఆల్ట్ మన్..కీలక ప్రకటన చేసిన సత్య నాదెళ్ల

By Asianet News  |  First Published Nov 20, 2023, 4:34 PM IST

ఓపెన్ ఏఐ మాజీ సీఈఓ శామ్ ఆల్ట్ మన్, సహ వ్యవస్థాపకుడు  గ్రెగ్ బ్రాక్ మన్ మైక్రోసాఫ్ట్ లో చేరనున్నారు. దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల  సోమవారం కీలక ప్రకటన చేశారు. వారిద్దరూ తమ సంస్థలో చేరనున్నారని స్పష్టం చేశారు.


ఓపెన్ ఏఐ మాజీ సీఈఓ శామ్ ఆల్ట్ మన్, మాజీ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్ మన్ మైక్రోసాఫ్ట్ లో చేరనున్నారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం ప్రకటించారు. వారిద్దరూ తమ సంస్థలో చేరి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ కోసం కొత్త బృందానికి నేతృత్వం వహిస్తారని తెలిపారు.

‘‘ఓపెన్ఏఐతో మా భాగస్వామ్యానికి మేము కట్టుబడి ఉన్నాం. మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్ లో మేము ప్రకటించిన ప్రతిదానితో సృజనాత్మకతను కొనసాగించే మా సామర్థ్యం, మా వినియోగదారులు, భాగస్వాములకు మద్దతును కొనసాగించడంలో మాకు నమ్మకం ఉంది. ఎమ్మెట్ షియర్, ఓపెన్ ఏఐ కొత్త నాయకత్వ బృందం గురించి తెలుసుకోవడానికి, వారితో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాం. సామ్ ఆల్ట్ మన్, గ్రెగ్ బ్రోక్ మన్, సహోద్యోగులతో కలిసి కొత్త అధునాతన ఏఐ పరిశోధన బృందానికి నాయకత్వం వహించడానికి మైక్రోసాఫ్ట్ లో చేరనున్నారు. ఈ వార్తను పంచుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. వారి విజయానికి అవసరమైన వనరులను అందించడానికి వేగంగా ముందుకు సాగడానికి మేము ఎదురు చూస్తున్నాం’’ అని సత్య నాదెళ్ల ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో పోస్టు పెట్టారు.

We remain committed to our partnership with OpenAI and have confidence in our product roadmap, our ability to continue to innovate with everything we announced at Microsoft Ignite, and in continuing to support our customers and partners. We look forward to getting to know Emmett…

— Satya Nadella (@satyanadella)

Latest Videos

కాగా.. గత వారం ఓపెన్ఏఐ తొలగించిన ఆల్ట్మన్ రీ ఎంట్రీ కోసం కంపెనీ బోర్డుతో చర్చలు జరిపారు. కానీ ఒప్పందం విఫలమైంది. చాట్ జీపీటీ డెవలపర్ మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా ఉన్న ఎమెట్ షియర్ ను తాత్కాలిక సీఈవోగా నియమించుకుంది. ఆల్ట్ మాన్ తో బహిరంగంగా జతకట్టిన మీరా మురాటి స్థానంలో షియర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయంలో ఓపెన్ ఏఐ ఎగ్జిక్యూటివ్ లతో సమావేశం కావాలని ఆల్ట్ మన్ ను ఆహ్వానించిన కొద్ది గంటల్లోనే మురాటిని తొలగించారు. 

click me!