Cargo Ship: ఇండియాకు వస్తున్న కార్గో షిప్‌ హైజాక్.. ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల చర్య

By Mahesh K  |  First Published Nov 19, 2023, 10:42 PM IST

ఇండియాకు వస్తున్న కార్గో షిప్‌ను యెమెన్ దేశ తీరాన హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. తాము ఇజ్రాయెల్ దేశ నౌకను యెమెన్ తీరానికి తెచ్చినట్టు ఓ హౌతి అధికారి తెలిపారు. కానీ, ఇది టర్కీ నుంచి భారత్‌కు బయల్దేరిన నౌక అని, అందులో పలు దేశాలకు చెందిన 50 మంది క్రూ సభ్యులు ఉన్నారని, అందులో ఇజ్రాయెల్ పౌరులు లేరని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
 


న్యూఢిల్లీ: టర్కీ నుంచి ఇండియాకు బయల్దేరిన ఓ కార్గో షిప్‌ను ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. ఆ షిప్‌లో 50 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. వారంతా పలు దేశాలకు చెందినవారు. అయితే.. ఇందులో భారతీయులు లేరని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.

ఈ హైజాక్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్స్ వేదికగా ధ్రువీకరించింది. యెమెన్ సమీపంలో ఎర్ర సముద్రం దక్షిణం వైపున ఈ కార్గో షిప్‌ను హౌతి తిరుగుబాటుదారులు హైజాక్ చేసినట్టు వివరించింది. ఇది అంతర్జాతీయంగా విపరిణామాలకు దారి తీస్తుందని తెలిపింది. ఈ షిప్‌లో చాలా దేశాల పౌరులు ఉన్నారని, కానీ, ఇజ్రాయెల్ పౌరులు లేరని స్పష్టం చేసింది. ఇది ఇజ్రాయెల్ నౌక కూడా కాదని తెలిపింది.

Latest Videos

undefined

ఇదే ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పందించింది. అంతర్జాతీయ నౌక పై ఇరానియన్ దాడిని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొంది. ఈ నౌకను బ్రిటీష్ కంపెనీకి చెందినదైతే జపనీస్ కంపెనీ ఆపరేట్ చేస్తున్నదని వివరించింది. ఇరాన్ సూచనలతోనే యెమెనైట్ హౌతీ మిలిషియా హైజాక్ చేసిందని తెలిపింది.

Also Read : Crime News: గడ్డివాములో ప్రియుడితో భార్య సరసాలు.. సజీవంగా దహనం చేసిన భర్త: పోలీసులు

ఇజ్రాయెల్ కార్గో షిప్‌ను యెమెనీ తీరానికి తీసుకెళ్లినట్టు ఓ హౌతీ అధికారి ఏఎఫ్‌పీకి చెప్పారు. సలీఫ్ పోర్టుకు దీన్ని తీసుకెళ్లినట్టు హొదెయిడాకు చెందిన ఓ మేరీటైమ్ సోర్స్ తెలిపింది. ఈ షిప్ పై 25 మంది క్రూ సభ్యులు ఉక్రెయిన్, బల్గేరియా, ఫిలిపినో, మెక్సికన్ సహా పలు దేశాల పౌరులు అని ఇజ్రాయెల్ పీఎం ఆఫీస్ వెల్లడించింది. అయితే, ఇజ్రాయెలీలు మాత్రం లేరని వివరించింది.

ఈ నౌక బ్రిటీష్ కంపెనీ పేరిట రిజిస్టర్ అయిందని, ఈ కంపెనీలో ఇజ్రాయెలీ టైకూన్ అబ్రహం ఉంగార్‌కు కూడా పాక్షిక యాజమాన్య హక్కులు ఉన్నాయని వివరంచింది. ప్రస్తుతం ఈ నౌక జపాన్ కంపెనీ లీజుకు తీసుకుందని పేర్కొంది.

click me!