israel hamas war : గాజాలోని ఓ హాస్పిటల్ కింద హమాస్ దళాలు ఏర్పాటు చేసుకున్న ‘టెర్రరిస్ట్ టన్నెల్’ ను ఇజ్రాయెల్ దళాలు గుర్తించాయి. ఇది హాస్పిటల్ కు 10 మీటర్ల దూరంలో 55 మీటర్ల పొడవుతో ఉందని ఐడీఎఫ్ తెలిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘ఎక్స్’లో విడుదల చేసింది.
israel hamas war : ఇజ్రాయెల్ దళాలు, హమాస్ దళాలకు మధ్య పోరు కొనసాగుతోంది. దీంతో ఇర వైపులా తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతోంది. గాజాలో ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ విరుచుకుపడుతోంది. గాజాలో హమాస్ కు రక్షణ కల్పిస్తున్న, దాడులకు పాల్పడేందుకు ఉపయోగిస్తున్న సౌకర్యాలపై ఇజ్రాయిల్ దాడి చేస్తోంది. అందులో భాగంగా తాజాగా గాజాలోని షిఫా ఆస్పత్రి కాంప్లెక్స్ కింద ఓ టెర్రరిస్ట్ టన్నెల్ ను గుర్తించింది.
విషాదం.. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి సూసైడ్.. ఏం జరిగిందంటే ?
undefined
హాస్పిటల్ కు 10 మీటర్ల దూరంలో 55 మీటర్ల పొడవైన 'ఉగ్రవాద సొరంగం' ఉన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్), ఇజ్రాయెల్ సెక్యూరిటీస్ అథారిటీ (ఐఎస్ఏ) ప్రకటించాయి. ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ సందర్భంగా షిఫా హాస్పిటల్ కాంప్లెక్స్ కింద దీనిని గుర్తించామని ఐడీఎఫ్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. టన్నెల్ ప్రవేశ ద్వారం బ్లాస్ట్ ప్రూఫ్ డోర్, ఫైరింగ్ హోల్ వంటి వివిధ రక్షణ యంత్రాంగాలు అందులో ఉన్నాయని పేర్కొంది.
OPERATIONAL UPDATE: IDF and ISA forces revealed a significant 55-meter-long terrorist tunnel, 10 meters underneath the Shifa Hospital complex during an intelligence-based operation.
The tunnel entrance contains various defense mechanisms, such as a blast-proof door and a firing… pic.twitter.com/tU4J6BD4ZG
ఇజ్రాయెల్ దళాలు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు హమాస్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ సొరంగం ప్రవేశ ద్వారం బ్లాస్ట్ ప్రూఫ్ డోర్, ఫైరింగ్ హోల్ వంటి వివిధ రక్షణ యంత్రాంగాలను రూపొందించారని ఐడీఎఫ్ వెల్లడించింది. ‘గాజా వాసులను, షిఫా హాస్పిటల్ రోగులను హమాస్ మానవ కవచాలుగా ఉపయోగించుకోవడం గురించి కొన్ని వారాలుగా ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఇదిగో ఇక్కడ మరన్ని ఆధారాలు ఉన్నాయి’ అని పేర్కొంది.
Crime News: గడ్డివాములో ప్రియుడితో భార్య సరసాలు.. సజీవంగా దహనం చేసిన భర్త: పోలీసులు
కాగా.. హాస్పిటల్ లో ఉన్న అదనపు గాజాన్లను సురక్షిత మార్గం ద్వారా తరలించడానికి వీలు కల్పించాలని షిఫా ఆసుపత్రి డైరెక్టర్ చేసిన అభ్యర్థనను ఈ ఉదయం తాము అంగీకరించామని ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. వైద్య తరలింపు కోసం ఏవైనా అభ్యర్థనలను ఐడీఎఫ్ అందిస్తామని తాము ప్రతిపాదించామని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ పై అక్టోబర్ 7వ తేదీన దాడి జరిగింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. తాగాజా ఈ పోరు 43వ రోజుకు చేరుకుంది. గాజాలో ఇజ్రాయెల్ తన గ్రౌండ్ ఆపరేషన్ ను కొనసాగిస్తోంది. ఇంటెలిజెన్స్ సమాచారం, ఆపరేషనల్ ఆవశ్యకత ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఎన్నికలు: ఆ పార్టీ అభ్యర్థులకు రక్షణ కల్పించండి.. వికాస్ రాజ్ ఆదేశం..
ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ గత గురువారం మాట్లాడుతూ.. తమ దేశం గాజాలోని హాస్పిటల్ ను టార్గెట్ గా చేసుకోలేదని సష్టం చేశారు. అయితే హమాస్ గాజాలోని హాస్పిటల్స్ కింద కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలను ఉంచిందని, అక్కడి నుంచే వారు ఇజ్రాయెల్ పౌరులను కాల్చి చంపుతున్నారని అన్నారు. అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రోగులు, డాక్టర్లు, సిబ్బంది ఎవరూ ఆపరేషన్లు ఆపకుండా చూసుకుంటున్నారని పేర్కొన్నారు.