దుండగుడి చేతిలో కత్తి పోటుకు గురైన రచయిత 75 ఏళ్ల సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. అతడి ఒక కన్ను చూపు కోల్పోయే అవకాశం ఉందని, అలాగే కాలేయం కూడా దెబ్బతింటోదని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ‘‘వార్త మంచిది కాదు’’ అని ఆయన ఏజెంట్ ఆండ్రూ వైలీ తెలిపారు.
Delhi police: ఉగ్ర కుట్ర భగ్నం.. 2 వేల తూటాలు స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసులు
‘‘ వార్త మంచిది కాదు. సల్మాన్ ఒక కన్ను కోల్పోయే అవకాశం ఉంది. ఆయన చేతిలో నరాలు తెగిపోయాయి. కాలేయం దెబ్బతింది. తింటోంది. ’’ అని ఆండ్రూ NYTకి ఇచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు. ముంబైలో జన్మించిన సల్మాన్ రష్ధీ ‘‘ ది సాటానిక్ వెర్సెస్’’ అనే నవలను రచించారు. ఇది వివాదస్పదం అయ్యింది. ఈ పుస్తకం ప్రచురితం అయిన నాటి నుంచి కొన్నాళ్లపాటు ఇస్లామిస్ట్ సంస్థల నుంచి అతడికి బెదిరింపులు వచ్చాయి. అయితే శుక్రవారం పశ్చిమ న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో న్యూజెర్సీలోని ఫెయిర్‌వ్యూకు చెందిన హదీ మాటర్ (24) దుండగుడి చేతిలో కత్తిపోటుకు గురయ్యాడు. నిందితుడిని గుర్తించామని న్యూయార్క్ స్టేట్ పోలీస్ మేజర్ యూజీన్ స్టానిస్జెవ్ స్కీ శుక్రవారం సాయంత్రం మీడియాతో తెలిపారు.
RSS Tiranga DP: ప్రొఫైల్ పిక్ ను మార్చిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్.. విపక్షాల విమర్శలకు పుల్ స్టాప్
నైరుతి న్యూయార్క్ రాష్ట్రంలోని చౌటౌక్వా సరస్సులో ఎన్జీవో అయిన చౌటౌక్వా ఇన్‌స్టిట్యూషన్‌లో ఓ వేదికపై సల్మాన్ రష్దీ ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు అతడి మెడపై కత్తితో పొడిచారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ డాక్టర్ రష్ధీకి వైద్య చికిత్స అందించారని, తరువాత వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారని స్టానిస్జెవ్ స్కీ చెప్పారు.
India-China Ties: "అక్కడ శాంతికి విఘాతం కలిగిస్తే.. ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం"
‘‘ రష్దీకి ఓ డాక్టర్ వెంటనే ప్రథమ చికిత్స ప్రారంభించారు. ఆయనను వెంటనే స్థానికంగా ఉన్న ట్రామా సెంటర్‌కు విమానంలో తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఆపరేషన్ జరిగింది. ’’ అని ఆయన తెలిపారు.