
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై ఆగంతకులు దాడి చేశారు. శుక్రవారం పశ్చిమ న్యూయార్క్‌లో ఆయన ఉపన్యాసం ఇవ్వబోతుండగా ఆగంతకుండు స్టేజీ మీదే సల్మాన్‌ను కత్తితో పొడిచాడు. దీంతో ఆయన వెంటనే నేలపై పడిపోయాడు. హుటాహుటిన స్పందించిన నిర్వాహకులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సాటానిక్ వర్సెస్ నవలతో వివాదాస్పద రచయితగా సల్యాన్ రష్దీ గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లోనే రష్దీపై ఫత్వా జారీ చేశాయి ఇస్లామిక్ సంఘాలు. ఈ క్రమంలో తరచుగా ఆయనకు బెదిరింపులు వస్తూనే వున్నాయి. ఇవాళ ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా రష్దీపై దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని న్యూయార్క్ పోలీసులు పట్టుకున్నారు.