Russia Ukraine War: ఆగని మ‌ర‌ణహోమం.. మారియుపోల్ దాడిలో 5,000 మృతి

Published : Mar 29, 2022, 06:42 AM IST
Russia Ukraine War: ఆగని మ‌ర‌ణహోమం.. మారియుపోల్ దాడిలో 5,000 మృతి

సారాంశం

Russia Ukraine War: ఉక్రెయిన్- ర‌ష్యా మ‌ధ్య యుద్దం కార‌ణంగా మారియుపోల్ లో  తీవ్ర‌మైన‌ విపత్త్క‌ర ప‌రిస్థితులు ఏర్పడాయ‌నీ, మానవతా సంక్షోభంలో కనీసం 5,000 మంది మరణించారని ఉక్రెయిన్ సోమవారం తెలిపింది.  

Russia Ukraine War: ఉక్రెయిన్‌ పై రష్యా భీక‌ర పోరు సాగిస్తోంది. ర‌ష్యా సైనిక చ‌ర్య ప్రారంభించి.. నెల రోజులు దాటినా యుద్దం మాత్రం ఆగ‌డం లేదు.  ఇప్ప‌టికే ఉక్రెయిన్ లోని ప‌లు న‌గ‌రాల‌ను స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేసింది ర‌ష్యా సైన్యం. ఈ యుద్దంలో వేలాది మంది అమయాకులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ఉక్రెయిన్లు ప్రాణాలు చేప‌ట్టుకుని.. పొరుగు దేశాల‌కు శ‌రణార్థులుగా వ‌ల‌స వెళ్తున్నారు. కోట్లాది ఆస్తి న‌ష్టం జ‌రిగింది.  ఈ నేప‌థ్యంలో యుద్దం విర‌మించాల‌ని ఐక్యరాజ్య సమితి వద్దని చెబుతున్నా.. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నా.. పుతిన్ మాత్రం.. త‌గ్గేదేలే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
 
ఇదిలాఉంటే.. మంగళవారం టర్కీలో ఇరుదేశాలు ముఖాముఖి శాంతి చర్చల జ‌రుగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంతోనూ ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా బాంబు దాడులు చేసింది. ర‌ష్యా దాడి కార‌ణంగా..  మారియుపోల్ లో  తీవ్ర‌మైన‌ విపత్త్క‌ర ప‌రిస్థితులు ఏర్పడాయ‌నీ, మానవతా సంక్షోభంలో కనీసం 5,000 మంది మరణించారని ఉక్రెయిన్ సోమవారం తెలిపింది.
 
మారియుపోల్‌లో కనీసం 5,000 మృత‌దేహాల‌ను ఇప్పటికే ఖననం చేయబడ్డాయ‌ని  సీనియర్ ఉక్రేనియన్ అధికారి అన్నారు. దేశ‌వ్యాప్తంగా  దాదాపు 10,000 మంది మరణించి ఉండవచ్చ‌ని భావిస్తున్నారు. కైవ్ సమీపంలో రష్యా దాడుల వ‌ల్ల‌  80,000 కంటే ఎక్కువ గృహాలకు విద్యుత్తు స‌ర‌ఫ‌రా నిలిచిపోయింద‌నీ, ర‌ష్యాన్ సైన్యాలు తూర్పు ఉక్రెయిన్‌పై దృష్టి సారించడంతో ఉన్నప్పటికీ రాజధాని తీవ్ర సంక్షోభం  ఎదుర్కొంటుంద‌నీ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఉక్రెయిన్‌లో మానవతావాద కాల్పుల విరమణను కోరుతున్నట్లు సోమవారం ప్రకటించారు, దాని సహాయ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ త్వరలో ర‌ష్యా- ఉక్రెయిన్ల మ‌ధ్య సంధిని పొందేందుకు ప్రయత్నిస్తున్న‌ట్టు తెలిపారు.

గ‌త‌ నెల రోజులుగా జ‌రుగుతున్న ఈ దాడిలో పది మిలియన్ల ఉక్రేనియన్లు తమ ఇళ్లను విడిచిపెట్టి.. పొరుగు దేశాల‌కు పారిపోయారనీ, దేశవ్యాప్తంగా 20,000 మంది మరణించి ఉండవచ్చని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు. రష్యా  నివాస‌ప్రాంతాలపై విచక్షణారహితంగా షెల్లింగ్ దాడుల‌కు పాల్పడిందని ఆరోపించారు. ర‌ష్య తీరును పాశ్చాత్య, మిత్రదేశాలు యుద్ధ నేరంగా పేర్కొన్నాయి.
దక్షిణ ఒడెస్సా, ఖెర్సన్ ప్రాంతాల్లో రష్యా బలగాలు నిషేధిత క్లస్టర్ బాంబులను ఉపయోగించినట్లు రుజువు ఉందని ఆ దేశ ప్రాసిక్యూటర్ జనరల్ ఇరినా వెనెడిక్టోవా సోమవారం తెలిపారు.

ప్రైవేట్ రష్యన్ మిలిటరీ సంస్థ వాగ్నర్ గ్రూప్ తూర్పు ఉక్రెయిన్‌కు వెళ్లిందని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.  ర‌ష్యా ఎక్కువ మంది కిరాయి సైనికులను పోరాట కార్యకలాపాలను చేపట్టాలని భావిస్తున్నారని అన్నారు. మారియుపోల్‌లో మానవతా అవసరాలు చాలా దారుణంగా ఉన్నాయనీ, ఇక్కడ సుమారు 160,000 మంది పౌరులు ఆహారం, నీరు, ఔషధాల కోసం ఇబ్బంది ప‌డుతున్నార‌నీ, వారు రష్యా దళాలచే చుట్టుముట్టబడి ఉన్నారని ఉక్రెయిన్ పేర్కొంది.

ఉక్రెయిన్ ప్ర‌జ‌లు తీవ్ర విప‌త్త్క‌ర పరిస్థితుల‌ను ఎదుర్కొంటున్నార‌ని  ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా దాడి వ‌ల్ల.. ఒకప్పుడు 450,000 మంది ప్రజలు నివసించే మారియుపోల్ నగరం స్మ‌శ‌న‌వాటిక‌గా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మారియుపోల్ థియేటర్ దాడిలో దాదాపు 300 మందిని చనిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇప్ప‌టికే ప్ర‌పంచ దేశాలు ర‌ష్యాపై ఆంక్షాలు విధించిన విష‌యం తెలిసిందే. ర‌ష్యా కూడా ఆర్థికంగా చాలా న‌ష్ట‌పోయింది. కానీ పుతిన్ మాత్రం త‌న మొండి ప‌ట్టు వీడ‌వ‌టం లేదు.  ఫ్రాన్స్, గ్రీస్, టర్కీలకు ఉక్రెయిన్ దేశీయుల‌ను త‌ర‌లించాల‌ని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భావిస్తున్నారట‌. ఈ మేర‌కు చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతోన్న‌ట్టు తెలుస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పుతిన్ ఎంతో కాలం అధికారంలో కొనసాగలేడ‌ని, చర్యల ద్వారా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు. బిడెన్ పాలన మార్పు కోసం పిలుపునివ్వడాన్ని పుతిన్  ఖండించారు.  

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే