Mexico Shootout : మెక్సికోలో కాల్పుల బీభ‌త్సం.. 19 మందిని హ‌త‌మర్చిన‌ దుండగులు..

By Rajesh KFirst Published Mar 29, 2022, 1:05 AM IST
Highlights

Mexico Shootout : మెక్సికోలో మ‌ర‌ణ‌హోమం సృష్టించ‌బ‌డింది. ఓ వేడుకలో దుండ‌గులు కాల్పులకు తెగ‌బ‌డి.. 19 మందిని అత్యంత దారుణంగా హ‌త‌మర్చారు.  వీరిలో 13 మంది పురుషులు, మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆ ఘటనలో గాయపడిన మరికొంత మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు అక్కడి స్టేట్‌ అటార్నీ జనరల్‌ కార్యాలయం (ఎఫ్​జీఈ) వెల్లడించింది.
 

Mexico Shootout: మెక్సికోలో కాల్పుల కల‌కలం రేగింది. మిచోకాన్ రాష్ట్రంలో జరిగిన ఓ వేడుకలో దుండగులు కాల్పులకు పాల్పడి మ‌ర‌ణ హోమాన్ని సృష్టించారు. విచ‌క్ష‌ణ ర‌హితంగా జ‌రిపిన కాల్పుల్లో 19 మంది మృతి చెందారు. చ‌నిపోయిన వారిలో 16 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. కాల్పులు ఎందుకు జ‌రిగాయి. ఈ కాల్పులు ఎవరు జరిపింది.. అనేది ఇంకా తెలియరాలేదు. దాడులకు పాల్పడిన వారికోసం ముమ్మర గాలింపు చేపట్టినట్టు పేర్కొంది. సంఘటనా స్థలంలో 19 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించినట్లు మిచోకాన్ రాష్ట్ర అటార్నీ జనరల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

మిచోకాన్, దాని పొరుగునే ఉండే గ్వానాజువాటో రాష్ట్రాల్లో ఇటువంటి హింసాత్మక దాడులు సర్వసాధారణం. ఇలాంటి దారుణాలు తరచూ చోటు చేసుకుంటాయి. రాష్ట్రాలు మాఫియా గ్యాంగ్స్‌కి అడ్డాగా మారాయి. ఈ గ్యాంగ్స్ ప్రత్యర్థులపై జరిపే దాడుల్లో తరచూ భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. ముఖ్యంగా బార్‌లు, పబ్‌లనే లక్ష్యంగా చేసుకొని..  ప్రత్యర్థి మూఠాల‌పై దాడులకు పాల్పడుతుంటాయి. 

అలాగే.. సెంట్రల్‌ మెక్సికోలోని లాస్‌ టినాజాస్‌ ప్రాంతంలో పెట్రోల్‌ చోరీ మాఫియా ప్రభావం ఎక్కువ. ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీలకు చెందిన పైపులను చోరీ పాల్పడే ఘటనలు కూడా ఎక్కువగా చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో ముఠాల మధ్య దాడులు జరుగుతుంటాయి. తాజా దాడి కూడా లాస్‌ టినాజాన్‌ ప్రాంతంలోనే జరిగింది.  ఈ దాడిలో 17 మంది మృతి చెందారు. ప్రత్యర్థి గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు జలిస్కో న్యూ జెనరేషన్ కార్టెల్‌కి చెందిన ఓ గ్రూప్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రచారం జరిగింది. 

మిచోకాన్ రాష్ట్రం ప్రపంచంలోనే భారీ ఎత్తున అవకాడో ఫ్రూట్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ ఓ ప్లాంట్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అమెరికా వ్యక్తిపై గత నెలలో మాఫియా గ్యాంగ్స్ బెదిరింపులకు పాల్పడ్డాయి. దీంతో మెక్సికో నుంచి అవకాడో దిగుమతులను ఒక వారం పాటు అమెరికా నిలిపివేసింది. గత 16 ఏళ్లలో మెక్సికోలో 3,40,000 హత్యలు జరిగాయి. ఇందులో ఎక్కువ శాతం హత్యలు మాఫియా గ్యాంగ్స్ ప్రత్యర్థి గ్యాంగ్స్‌పై జరిపిన దాడుల్లో జరిగినవే. మెక్సికో అంటేనే హింసకు కేరాఫ్‌ అనేలా ఈ ఘటనలు ఉన్నాయి.

click me!