మూడో ప్రపంచ యుద్ధం? నాటో దేశం పోలాండ్‌లో రష్యా క్షిపణులు! ఇద్దరు పౌరులు దుర్మరణం, నాటో దేశాలు ఏమంటున్నాయ్?

Published : Nov 16, 2022, 02:56 AM IST
మూడో ప్రపంచ యుద్ధం? నాటో దేశం పోలాండ్‌లో రష్యా క్షిపణులు! ఇద్దరు పౌరులు దుర్మరణం, నాటో దేశాలు ఏమంటున్నాయ్?

సారాంశం

రష్యా ప్రయోగించిన క్షిపణులు అనుకోకుండా ఉక్రెయిన్ పొరుగు దేశం, నాటో సభ్య దేశం పోలాండ్‌లో పడినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలపై నాటో సభ్య దేశాలు అలర్ట్ అయ్యాయి. అమెరికా రక్షణ శాఖ ఇంకా ఈ దాడిని ధ్రువీకరించలేదు. మరింత సమాచారం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపింది. కాగా, ఈ దాడులపై వాదనలను రష్యా కొట్టివేసింది.  

న్యూఢిల్లీ: ప్రపంచమంతా వణికిపోయే ఓ వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఉక్రెయిన్ పై ప్రయోగించిన రష్యా క్షిపణులు అనుకోకుండా పోలాండ్ దేశంలో పడిపోయినట్టు ఆ వాదనలో కీలక అంశం. ఈ పేలుడులో ఇద్దరు పోలాండ్ పౌరులు మరణించారనే సారాంశం. ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలాండ్ నాటో సభ్య దేశం. దీంతో నాటో కూటమి సభ్య దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఈ వార్త నేపథ్యంలోనే పోలాండ్ దేశం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. దీంతో మూడో ప్రపంచ యుద్ధంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఉక్రెయిన్ కీలక నగరాలపై రష్యా దాడి తీవ్రతరం చేసింది. పోలాండ్ నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉక్రెయిన్ నగరం ల్వైవ్‌లో కూడా క్షిపణి దాడులు జరిగాయి. తాజాగా, ఓ వార్త సోషల్ మీడియాను కుదిపేస్తున్నది. మూడో ప్రపంచ యుద్ధ భయాలను రేపుతున్నాయి.

పోలాండ్ తూర్పు భాగాన ఉక్రెయిన్‌తో సరిహద్దుకు సమీపంలో జెవోడో గ్రామంలో పేలుడు సంభవించింది. ఇందులో ఇద్దరు పౌరులు మరణించినట్టు రెస్క్యూ సిబ్బంది మంగళవారం తెలిపారు. అయితే, ఈ పేలుడు రష్య ప్రయోగించిన క్షిపణుల కారణంగానే అనే వాదనలు వచ్చాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది.

Also Read: Russia Ukraine Crisis:యుద్ధానికి కారణం నాటో కూటమేనా? నాటో అంటే ఏమిటి? రష్యా ఎందుకు ద్వేషిస్తుంది?

రష్యా క్షిపణులే ఉక్రెయిన్ సరిహద్దు దాటి పోలాండ్ భూభాగంలో పడ్డాయని అమెరికా సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు చెప్పినట్టు అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్ చేసింది. కానీ, ఈ వాదనను అమెరికా రక్షణ శాఖ ధ్రువీకరించలేదు. పోలాండ్ నుంచి వస్తున్న వార్తలను ఇప్పుడే ధ్రువీకరించలేమని పెంటగాన్ పేర్కొంది. మరింత సమాచారం సేకరించడానికి తాము పోలాండ్ ప్రభుత్వంతో అనుసంధానంలో ఉన్నామని వివరించింది. 

ఇదిలా ఉండగా రష్యా రక్షణ శాఖ ఈ వాదనలను తోసిపుచ్చింది. రష్యా క్షిపణులు పోలాండ్ దేశంలో పేలిన వాదనలను కొట్టేసింది. పరిస్థితులను మరింత దిగజార్చడానికే ఇలా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వాదనలు తెరమీదకు తెస్తున్నారని తెలిపింది. ఉక్రెయిన్, పోలాండ్ సరిహద్దు సమీప ప్రాంతాలను రష్యా టార్గెట్ చేసుకోలేదని, అక్కడి విధ్వంసానికి తమతో సంబంధం లేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

Also Read: Russia Ukraine Crisis: రష్యాకు ఉక్రెయిన్ అంటే ఎందుకు అంతటి ప్రాధాన్యత.. యుద్ధం చేసేంత అవసరం ఏమిటి?

ఇదిలా ఉండగా ఈ వార్తపై నాటో సభ్య దేశాలు వెంటనే రియాక్ట్ అయ్యారు. దేశ భద్రత, రక్షణ వ్యవహారాల కమిటీలు అత్యవసరంగా సమావేశం కావాలని పోలాండ్ ప్రధాని ఆదేశించినట్టు ప్రభుత్వ ప్రతినిధి పిట్ర్ ముల్లర్ ట్వీట్ చేశారు. ఈ కమిటీ సమావేశం తర్వాత అవసరమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తామని వివరించారు. అప్పటి వరకు ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచురించరాదని ఆయన మీడియాకు పిలుపు ఇచ్చారు. వదంతులు వ్యాపించడానికి కారణం కావొద్దని సూచనలు చేశారు.

నాటో క్షేత్రం పోలాండ్‌లోనూ రష్యా క్షిపణులు పడ్డాయని లాట్వియా డిప్యూటీ పీఎం అర్టిస్ పాబ్రిక్స్ పేర్కొన్నారు. ఇది చాలా సీరియస్ ఘటన అని, కానీ, స్పష్టమైన వివరాలు ఇంకా రాలేవని నార్వే విదేశాంగ మంత్రి అన్నికెన్ హుట్‌పెల్డ్ తెలిపారు. తాము మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని నార్వే, లిథువేనియా, ఇస్టోనియా దేశాలు పేర్కొన్నాయి.

Also Read: Russia Ukraine War: ఈ యుద్ధంతో ఎవరు లబ్ది పొందుతున్నారు? ఎలా లాభాలు ఆర్జిస్తున్నారు? యుద్ధం వెనుక కథ ఇదీ

మూడో ప్రపంచ యుద్ధం గురించిన చర్చ ఒక వైపు వస్తుండగా.. మరికొందరు ఆందోళన చెందుతూ తాము అందుకు వ్యతిరేకం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు ఇంకా తార్కికంగా ఆలోచించి ఈ యుద్ధం మొదలే కాదు.. ఎందుకంటే ఎదటి వ్యక్తి ఎన్నడో మరణించాడని పరోక్షంగా సోవియట్ యూనియన్‌ను ఉల్లేఖించాడు. సోవియట్ యూనియన్ నుంచి కాపాడుకోవాలనే లక్ష్యంతో నాటో ఏర్పడిన సంగతి తెలిసిందే.  కాగా, చరిత్రాత్మక క్షణాల్లో తాము ఉండాలని అనుకోవడం లేదని ఇంకొందరు జోవియల్‌గా కామెంట్ చేశారు. ఇంకొందరు తాము రేడియోయాక్టివ్ డస్ట్ కావాలని భావించడం లేదని ట్వీట్లు చేశారు.

PREV
click me!

Recommended Stories

Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే
20 వేల కిలో మీట‌ర్లు, 21 రోజుల ప్ర‌యాణం.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద రైలు మార్గం. ఈ ఊహ ఎంత బాగుందో..