వర్జీనియా యూనివర్సిటీలో తుపాకీ మోత.. ముగ్గురు మృతి

By Rajesh KarampooriFirst Published Nov 15, 2022, 12:59 PM IST
Highlights

అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ క్యాంపస్‌లో రాత్రి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా ఫుట్‌బాల్ జట్టులోని ముగ్గురు సభ్యులు మరణించారు. అదే సమయంలో మరో ఇద్దరికి గాయాలైనట్లు యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో వర్జీనియా విశ్వవిద్యాలయం ప్రధాన క్యాంపస్ అయిన షార్లెట్స్‌విల్లే మూసివేయబడింది.

మరోసారి అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం చేలారేగింది. అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆదివారం రాత్రి కాల్పులు జరిగాయి.  ఈ ఘటనలో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా ఫుట్‌బాల్ జట్టులోని ముగ్గురు సభ్యులు మరణించారు. అదే సమయంలో మరో ఇద్దరికి గాయాలైనట్లు యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా పోలీసులు తెలిపారు. వర్జీనియా యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో మరణించిన వారిని లావెల్ డేవిడ్, డిసీన్ పెర్రీలు (బాట్‌బాల్ క్రీడాకారులు) అని తెలిపారు.

ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. నిందితులను అదుపులోకి తీసుకున్నటు తెలుస్తోంది. ఆదివారం రాత్రి 10:30 గంటలకు కాల్పులు జరిగిన కొద్ది గంటల తర్వాత అనుమానిత విద్యార్థి క్రిస్టోఫర్ డార్నెల్ జోన్స్ (22)ని అరెస్టు చేసినట్లు యూనివర్శిటీ పోలీసులు తెలిపారు.

వర్జీనియా యూనివర్సిటీ (UVA)ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్రకారం.. వర్జీనియా విశ్వవిద్యాలయం ప్రధాన క్యాంపస్ అయిన షార్లెట్స్‌విల్లేను మూసివేయబడింది. యూవీఏ ప్రెసిడెంట్ జిమ్ ర్యాన్ మాట్లాడుతూ..  దాడి చేసిన వ్యక్తి క్రిస్టోఫర్ డార్నెల్ జోన్స్ అని, అతడు యూనివర్సిటీ విద్యార్థి అని గుర్తించారు. ఆయన  UVA ఫుట్‌బాల్ జట్టు మాజీ ఆటగాడని, యూనివర్శిటీలోని అన్ని తరగతులను ప్రస్తుతానికి సస్పెండ్ చేసినట్లు యూవీఏ పోలీసు విభాగం తెలిపింది. క్రిస్టోఫర్ డార్నెల్ జోన్స్  ఫోటోను పోలీసులు విడుదల చేశారు.

విద్యార్థుల భద్రతపై ఆందోళన: ఆంథోనీ మిరాండా

ఈ ఘటనపై న్యూ ఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో సాంస్కృతిక, విద్యా వ్యవహారాల పబ్లిక్ డిప్లమసీ కౌన్సెలర్ ఆంథోనీ మిరాండా స్పందించారు. తన దేశంలో కాల్పుల ఘటనలు పెరగడం గురించి సీరియస్‌గా మాట్లాడారు. అమెరికా విద్యార్థులైనా, విదేశీ విద్యార్థులైనా.. విద్యార్థుల భద్రతపై ఆందోళన చెందుతున్నామని చెప్పారు. యూనివర్శిటీలు భద్రతను సీరియస్‌గా తీసుకుంటున్నాయనీ, విద్యార్థులు ఏదైనా తప్పు లేదా అనుమానాస్పదంగా వ్యవహరించినా ..అధికారులను అప్రమత్తంగా వ్యవహరిస్తారని తెలిపారు. దీనితో పాటు గత ఏడాదితో పోలిస్తే అమెరికాను ఉన్నత విద్యకు ఎంచుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య 19 శాతం పెరగడం సంతోషంగా ఉందన్నారు. అమెరికన్ విద్యారంగంలో భారతీయ విద్యార్థుల దృక్పథాలకు ఇది నిజమైన నిదర్శనమని తెలిపారు.

click me!