డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచారం ఆరోపణలు.. రచయిత్రి కారోల్ క్లెయిమ్..

By SumaBala BukkaFirst Published Sep 21, 2022, 11:11 AM IST
Highlights

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై అత్యాచారం ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఓ రచయిత్రి ఈ మేరకు కోర్టులో దావా వేయడానికి యోచిస్తోంది. 

వాషింగ్టన్ :  అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై  ఓ రచయిత్రి అత్యాచారం ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. 1996వ సంవత్సరంలో మిడ్ టౌన్ మాన్హట్టన్ లోని బెర్గ్ డార్ఫ్ గుడ్ మాన్ డిపార్ట్మెంట్ స్టోర్ లోని డ్రెస్సింగ్ రూమ్లో ట్రంపు తనపై అత్యాచారం చేశాడని రచయిత్రి ఈ జీన్ కారోల్ ఆరోపించారు. ట్రంప్ పై తన క్లయింట్ అయిన రచయిత్రి జీన్ కారోల్ కోర్టులో దావా వేయాలని యోచిస్తున్నట్లు అమెరికా న్యాయవాది తెలిపారు. 

ట్రంప్ తనపై అత్యాచారం చేయడం వల్ల తాను మానసిక క్షోభను అనుభవించానని అందుకే తాను కోర్టులో దావా వేయాలని భావిస్తున్నట్లు రచయిత్రి చెప్పారు. కాగా, కారోల్ పై తాను అత్యాచారం చేయలేదని ట్రంప్ చెప్పారు. కారోల్ రాసిన పుస్తకాన్ని విక్రయించడానికి తనపై అత్యాచారం క్లెయిమ్ ను రూపొందించారని ట్రంపు ఆరోపించారు. ఇప్పటికే ట్రంప్ రహస్య పత్రాలు తీసుకువెళ్లారని కేసు ఎదుర్కొంటున్నారు. కారోల్ తరఫు న్యాయవాదులు  అత్యాచారం జరిగినప్పుడు కారోల్ ధరించినట్లు పేర్కొన్న దుస్తులతో సరిపోల్చడానికి ట్రంప్ నుంచి డీఎన్ఏ సాంపిల్ ను సేకరించాలనుకుంటున్నారు. 

మోదీ గొప్ప వ్యక్తి.. అద్భుతంగా పని చేస్తున్నారు: డోనాల్డ్ ట్రంప్ ప్రశంసలు

click me!